ఎమర్జెన్సీ విధించిన రోజు ఎప్పటికీ మర్చిపోలేం !

Telugu Lo Computer
0


మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమవుతూ ఉండేది. ఈ నెల 21 నుంచి ఆయన అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటించబోతున్నందువల్ల 102వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ముందుగానే ప్రసారం చేశారు.  మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలతో సంభాషించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇది 102వ ప్రసారం ఇవాళ జరిగింది. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి నెలలో చివరి ఆదివారం నిర్వహిస్తారు. సాధారణంగా ప్రతి నెలా చివరి ఆదివారం నాడు 'మన్ కీ బాత్' మీ ముందుకు వస్తుందని.. అయితే ఈసారి ఆదివారం కంటే ముందే జరుగిందని ప్రధాని మోడీ ప్రారంభంలోనే తెలిపారు. పీఎం మోడీ ఇంకా మాట్లాడుతూ, మీ అందరికీ తెలుసు, నేను వచ్చే వారం అమెరికాలో ఉంటాను మరియు అక్కడ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది, కాబట్టి నేను వెళ్ళే ముందు, నేను మీతో మాట్లాడాలి, ఇంతకంటే మంచిది ఏమి ఉంటుంది అని అనుకున్నానని తెలిపారు. మన దేశ విపత్తు స్పందన సత్తా ఎంతో అభివృద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బిపర్‌జోయ్ తుపాను గుజరాత్‌లోని కచ్‌లో భారీ విధ్వంసం సృష్టించిందని, అయితే ప్రజలు పరిపూర్ణ ధైర్యసాహసాలతో, సర్వసన్నద్ధతతో దీనిని ఎదుర్కొన్నారని చెప్పారు. లక్ష్యం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనదైనా, భారతీయుల సమష్టి శక్తి, ఉమ్మడి బలం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందన్నారు. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. బిపార్జోయ్ తుఫానును ప్రస్తావించిన , ప్రధాని మోడీ రెండు మూడు రోజుల క్రితం దేశంలోని పశ్చిమ ప్రాంతాన్ని ఎంత పెద్ద తుఫాను తాకిందో చూశాము. బలమైన గాలులు, భారీ వర్షం. బిపార్జోయ్ తుఫాను కచ్‌లో భారీ వినాశనానికి కారణమైందని.. తుపాను వల్ల కచ్‌లో విధ్వంసం జరిగిందని, కానీ కచ్ ప్రజలు దానిని పూర్తి ధైర్యంతో, సన్నద్ధతతో ఎదుర్కొన్నారు అని ప్రధాని మోడీ అన్నారు. ఒకప్పుడు రెండు దశాబ్దాల క్రితం సంభవించిన భూకంపం తర్వాత కచ్ ఎప్పటికీ కోలుకోలేదన్నారు. ప్రస్తుతం అదే జిల్లా దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటిగా ఉందని గుర్తు చేశారు. బిపార్జోయ్ తుఫాను కారణంగా ఏర్పడిన విధ్వంసం నుంచి కచ్ ప్రజలు త్వరగా కోలుకుంటారని ప్రధాని మోడీ అన్నారు. నిస్సారమైన చౌడు భూములను సారవంతంగా, పచ్చదనంతో నిండిపోయేలా చేయాలంటే జపాన్‌లోని మియావాకీ అనే విధానం చాలా బాగుంటుందని తెలిపారు. ఈ టెక్నిక్‌ను క్రమంగా భారత దేశంలో కూడా అనుసరిస్తున్నారని తెలిపారు. కేరళలో టీచర్ రాఫి రామ్‌నాథ్ ఈ విధానాన్ని ఉపయోగించి 115 రకాల మొక్కలతో విద్యావనం పేరుతో ఓ చిన్న అడవిని సృష్టించారన్నారు. ఈ చిట్కాను ఉపయోగించాలని దేశ ప్రజలను కోరుతున్నానని చెప్పారు. యూపీలోని హాపూర్ జిల్లాలో ప్రజలు అంతరించిపోయిన నదిని పునరుద్ధరించారని ప్రధాని మోడీ అన్నారు. ఈ నది మూలాన్ని అమృత్ సరోవరంగా కూడా అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. మేనేజ్‌మెంట్ గురించి తెలుసుకోవాలంటే ఛత్రపతి శివాజీ మహారాజు పరిపాలనను పరిశీలించాలని చెప్పారు. ఆయన నుంచి ధైర్యసాహసాలతోపాటు ఆయన పరిపాలన నుంచి నేర్చుకోవలసినది చాలా ఉందన్నారు. ఆయన మేనేజ్‌మెంట్ స్కిల్స్, మరీ ముఖ్యంగా నీటి యాజమాన్యం, నావికా దళం నైపుణ్యాలు ఇప్పటికీ భారత దేశానికి గర్వకారణమని వివరించారు. ఎమర్జెన్సీ విధించిన రోజైన జూన్ 25ను ఎప్పటికీ మర్చిపోలేమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశ చరిత్రలో అదొక చీకటి కాలం అని అన్నారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమర్జన్సీ టైంలో లక్షలాది మంది ఎమర్జెన్సీని సర్వశక్తులు ఒడ్డి వ్యతిరేకించారు. . ఈ రోజు మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నప్పుడు ఇలాంటి నేరాలను కూడా గమనించాలి. ఇది యువ తరాలకు ప్రజాస్వామ్యం అర్థం. ప్రాముఖ్యతను నేర్పుతుంది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.- 2025 నాటికి టీబీని నిర్మూలించాలని భారత్ సంకల్పించిందని ప్రధాని మోడీ అన్నారు. స్వేచ్ఛా భారతదేశాన్ని తయారు చేయాలనే లక్ష్యం కచ్చితంగా పెద్దదే. ఒకప్పుడు టి.బి. గురించి తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు దూరంగా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. నేటి సమయంలో టి.బి.రోగిని కుటుంబంలో సభ్యునిగా చేయడం ద్వారా సహాయం చేస్తున్నారు. వసుధైక కుటుంబం కోసం యోగా అనేది ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాల ఇతివృత్తమని తెలిపారు. ఒక ప్రపంచం-ఒకే కుటుంబంగా అందరి సంక్షేమం కోసం యోగా అని తెలిపారు. యోగా స్ఫూర్తిని ఇది వ్యక్తం చేస్తుందన్నారు. ఇది అందరినీ అనుసంధానం చేసి, అందరూ తనను అనుసరించేలా చేస్తుందన్నారు. లక్ష్యం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనదైనా, భారతీయుల సమష్టి శక్తి, ఉమ్మడి బలం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)