సిగ్నలింగ్ పాయింట్‌లో మార్పుల వల్లే ఈ దారుణం !

Telugu Lo Computer
0


రైలు ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రమాదం కాదు.. సిగ్నలింగ్ పాయింట్‌లో మార్పుల వల్లే ఈ దారుణం జరిగిందని ఆయన వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ సిస్టంలో మార్పులు చేశారు. ఆ మార్పుల వల్లే ఇంతటి ప్రమాదం జరిగింది. కవచ్‌ లేకపోవడం ప్రమాదానికి కారణం కాదు. సిగ్నలింగ్‌ పాయింట్‌లో మార్పులు చేసిన వారిని గుర్తించాం. త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయి.. సిగ్నలింగ్‌లో జరిగిన ట్యాంపరింగ్‌పై నివేదిక సిద్ధమైంది అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. అయితే ప్రమాద స్థలంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. బుధవారం ఉదయానికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. రైల్వే భద్రతా కమిషనర్ ఈ విషయంపై దర్యాప్తు చేశారు. దానిపై నేను వ్యాఖ్యానించడం సరికాదు.. విచారణ నివేదిక రావాలి అని అన్నారు. వాస్తవానికి ఇప్పుడు మా దృష్టి పునరుద్ధరణపై ఉంది. రెండు ప్రధాన లైన్లు, రెండు లూప్ లైన్లు ఉన్నాయి. పని జరుగుతోంది. మేము ఖచ్చితంగా నిర్దేశించుకున్న లక్ష్యం సమయం కంటే ముందే పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని అశ్విని వైష్ణవ్ చెప్పారు. దీనికి ముందే.. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రధాని మోడీ ఫోన్‌ చేశారు. సహాయక చర్యలు, ట్రాక్‌ పనులపై ఆరా తీశారు. ట్రాక్‌ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని మంత్రికి సూచనలు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)