ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పిచ్చి ముదిరింది !

Telugu Lo Computer
0


ఓ జంట తమ ప్రీవెడ్డింగ్ షూట్‌కు క్రియేటివిటీ జత చేశారు. పాము కారణంగా వారిద్దరూ ఒక్కటైనట్లుగా చిత్రీకరించారు. ఓ యువతి ఇంటి బ్యాక్‌యార్డ్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ పాము కనపడుతుంది. ఆ పామును చూసి భయపడ్డ ఆమె, వెంటనే రెస్క్యూ టీంకు కాల్ చేస్తోంది. క్షణాల్లో ఇద్దరు యువకులు స్కూటీపై అక్కడకి చేరుకుంటారు. వారిలో ఒకరు ఆమెను పాము నుంచి కాపాడతారు. దానిని పట్టుకొని సురక్షితంగా ఓ బాక్స్‌లో బంధిస్తాడు. అనంతరం సదరు యువకుడు అక్కడి నుండి వెళ్లే సమయంలో ఫోన్ చేయమంటూ ఆమెకు సిగ్నల్ ఇస్తాడు. ఇలా పాము కారణంగా వారి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారితీస్తుంది. చివరలో సింబాలిక్‌గా వారిద్దరూ ముందు వెళ్తుంటే, వెనక పాము ఉన్నట్లు చూపిస్తారు. అంటే వారిని పాము ఒక్కటి చేసింది అన్నది కాన్సెప్ట్. ఈ వెరైటీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను వివేక్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేయగా, అది కాస్తా వైరల్ అవుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)