శ్రీవారి దర్శనంలో మార్పు ప్రయోగం సక్సెస్

Telugu Lo Computer
0


తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా వెండి వాకిలి నుంచి సింగిల్ లైన్ క్యూ లైను విధానం ద్వారా దర్శనం కల్పించారు. ఫలితంగా నాలుగేళ్ల కాలంలో రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం 4.02 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందు కోసం తాజాగా వెండి వాకిలి నుంచి సింగిల్ లైన్ క్యూ లైను విధానం అమలు చేసారు. దీంతో భక్తులు సులభరతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. నాలుగేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకోగలిగారు. ఈ విధానం ద్వారా ఒక్క రోజులో 92238 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లుగా టీటీడీ ప్రకటించింది. సర్వదర్శనం క్యూ లైను ద్వారానే స్వామివారిని 70 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. క్యూ లైను మార్పులను టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)