రెజ్లర్లు, రైతులకు మద్దతుగా హర్యానా బంద్‌

Telugu Lo Computer
0


రైతుల రుణాల రద్దు, పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధమైన హామీ తదితర డిమాండ్లతో పాటు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హర్యానాలో బుధవారం బంద్‌ నిర్వహించారు. వ్యవసాయదారులు, ఖాప్‌ సంస్థల సభ్యులు పెద్ద ఎత్తున రహదార్లపైకి వచ్చి భైఠాయించారు. దీంతో రోహతక్‌-దిల్లీ జాతీయ రహదారి రెండు గంటలకుపైగా స్తంభించింది. కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం చర్చలు జరుపుతుందన్న అధికారుల హామీతో నిరసనను విరమించినట్లు భూమి బచావో సంఘర్ష్‌ సమితి సీనియర్‌ నేత రమేశ్‌ దలాల్‌ తెలిపారు. కుంద్లి-మనేసర్‌-పల్వాల్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారిని కూడా దిగ్బంధించేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు వారిని తరిమి వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)