ప్రయాణికుల మనసు దోచుకున్న ఉబర్ క్యాబ్ డ్రైవర్ !

Telugu Lo Computer
0

                                             

ఢిల్లీకి చెందిన డ్రైవర్ అబ్దుల్ ఖదీర్ అసాధారణ సేవా గుణం గురించి వింటే అందరి మనసు చలించిపోతుంది. అతను ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ప్రయాణికుల ఇబ్బందుల గురించి ఆలోచించే ఖదీర్ తన కారులో కొన్ని సౌకర్యాలు అమర్చాడు. కారులో స్నాక్స్, నీరు, రసం, అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స చేయడానికి అవసరమైన మెడికల్ కిట్ అన్నీ అమర్చుకున్నాడు. ఇవన్నీ ప్రయాణికులకు ఉచితంగా అందిస్తున్నాడు. అంతేకాదు ప్రయాణీకుల సౌకర్యంతో పాటు పిల్లల సంక్షేమానికి సహకరించడానికి తన కారులో విరాళాల బాక్స్‌ను పెట్టాడు. ఇతని కారులో ప్రయాణించిన శ్యామ్‌లాల్ యాదవ్ అనే ట్విట్టర్ ఖదీర్ ఫోటోతో పాటు అతను ప్రయాణికులకు అందిస్తున్న సేవల గురించి తన ట్వీట్‌లో షేర్ చేశారు. ఈ కథనం నెటిజన్లను ఆకట్టుకుంది.

నెటిజన్లు ఉబెర్ డ్రైవర్ ఖదీర్ నిస్వార్థ సేవను ప్రశంసించారు. 'అదృష్టవశాత్తూ ఢిల్లీలో అతని క్యాబ్‌లో కూర్చునే అవకాశం నాకు కూడా లభించింది' అని ఒకరు.. 'మీరు మీ వృత్తిని ఇష్టపడినప్పుడే ఇలా ఉండగలుగుతారు' అని మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)