డ్రోన్ల ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ !

Telugu Lo Computer
0


ప్రధాని మోడీ పర్యటనకు ముందే  గతంలో భారత్ తో నిలిచిపోయిన డ్రోన్ల కొనుగోలు ఒప్పందానికి అంగీకారం తెలపాలని యూఎస్ షరతులు పెట్టింది. దీనిపై మోడీ టూర్ లో మాట్లాడదామని భారత్ చెప్పినా అంగీరించలేదు. దీంతో చివరికి మోడీ యూఎస్ లో అడుగు పెట్టడానికి వారం రోజుల ముందే భారత్ ఈ డ్రోన్ల ఒప్పందానికి అంగీకారం తెలిపింది. కేంద్రం ప్రవచిస్తున్న మేక్ ఇన్ ఇండియా, ఇతర నిబంధనల విషయంలో పట్టు వీడాలని యూఎస్ లోని బైడెన్ సర్కార్ నుంచి వచ్చిన ఒత్తిడితో భారత్ డ్రోన్ల డీల్ కుదుర్చుకోవడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో మోడీ పర్యటనకు కేవలం ఆరు రోజుల ముందు అంటే జూన్ 15న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ సామాగ్రి కొనుగోలు కౌన్సిల్ దాదాపు 30 MQ9 సీ గార్డియన్ డ్రోన్‌ల (ప్రిడేటర్ B డ్రోన్‌లు ) కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందానికి ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ముందు ఉంచడానికి ముందు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం అవసరం. మధ్య మధ్యలో, ఖర్చు చర్చలు, ఇతర రక్షణ సేకరణ విధానాలపై ఇరుదేశాలూ చర్చిస్తాయి. అలాగే మేకిన్ ఇండియా నిబంధన దీనికి వర్తిస్తుందా లేదా అన్న దానిపైనా ఇంకా స్పష్టత రాలేదు. భారత్‌లో సంయుక్తంగా తయారు చేయనున్న ఫైటర్ జెట్ ఇంజిన్‌లకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడంపై మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ల మధ్య జరిగే సమావేశంలో ప్రకటన వెలువడనుంది. హిమాలయ పర్వతాల్లో చైనాతో సరిహద్దు వెంబడి నిఘా సామర్థ్యాలను పెంచడానికి, భారత సైన్యం, నేవీ, వైమానిక దళం కోసం MQ-9 రీపర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. ఈ ఒప్పందం భారత సాయుధ బలగాల యొక్క కార్యాచరణ, సేకరణ అవసరాలను తీర్చడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో మొదటి ట్రై-సర్వీస్ కొనుగోలు అవుతుంది. MQ-9 రీపర్ వంటి ప్రాణాంతక సాయుధ డ్రోన్‌ను అభివృద్ధి చేయడానికి భారతదేశ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ లోపే యూఎస్ నుంచి వచ్చిన ఒత్తిడితో ఈ డీల్ కు అంగీకారం తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)