జులై 5 నుంచి ఫార్మా ఎగ్జిబిషన్ !

Telugu Lo Computer
0


ఇంటర్నేషనల్ ఫార్మా ఎగ్జిబిషన్ (ఐపీహెచ్ఈఎక్స్) 9 వ ఎడిషన్ ను ఫార్మాస్యూటికల్స్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాక్సిల్) వచ్చే నెల 5, -7 న హైదరాబాద్ లో నిర్వహించనుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఈ ఈవెంట్ జరుగుతుంది. సుమారు 375 మంది ఎగుమతిదారులు తమ ప్రొడక్ట్ లను ఈ ఈవెంట్ లో ప్రదర్శించనున్నారు. అలానే 120 దేశాల నుంచి 600 కి పైగా విదేశీ బిజినెస్ డెలిగేట్స్ హాజరుకానున్నారు. ఈ ఎగ్జిబిషన్ ను చూడడానికి 10 వేలకు పైగా విజిటర్లు వస్తారని ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ రావి ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. కామర్స్ మినిస్టర్ హాజరవుతారని అన్నారు. గ్లోబల్గా ఉన్న ఫార్మా కంపెనీలు కనెక్ట్ అవ్వడానికి, భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి ఈ ఎగ్జిబిషన్ వేదిక అవుతుందని ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. వన్ టూ వన్ బిజినెస్ మీటింగ్స్ ఉంటాయని చెప్పారు. గత ఎనిమిది ఎడిషన్లలో 120 కి పైగా దేశాల నుంచి 4,500 మంది ఫారిన్ డెలిగేట్స్ వచ్చారని, 3,500 మంది ఎగ్జిబిటర్లు తమ ప్రొడక్ట్ లను ప్రదర్శించారని వివరించారు. లక్ష మంది విజిట్ చేశారని చెప్పారు. దేశంలో జీ20 మీటింగ్స్ అవుతున్న సందర్భంగా వివిధ కంపెనీల సీఈఓ లతో రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఉంటాయని పేర్కొన్నారు. విదేశీ డెలిగేట్స్ కు సిటీలోని ఫార్మా తయారీ ప్లాంట్ లను చూపిస్తామని, ఇండియా ఇండస్ట్రీ ఫాలో అవుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ను వారికి పరిచయం చేస్తామని అన్నారు.  దేశీయ ఫార్మా ఎగుమతులు ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ (2023-24) లో 28 బిలియన్​ డాలర్లకు చేరతాయని ఫార్మాస్యూటికల్స్​ ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా (ఫార్మెక్సిల్​) డైరెక్టర్​ జనరల్​ ఉదయ భాస్కర్​ వెల్లడించారు. 2022-23 లో ఈ ఎగుమతులు 25.39 బిలియన్​ డాలర్లని చెప్పారు. ప్రస్తుత ఫైనాన్షియల్​ఇయర్​ ఏప్రిల్​, మే నెలల్లో ఫార్మా ఎగుమతులు వరసగా 10 శాతం, 0.7 శాతం గ్రోత్​ రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. 2022-23 లో ఫార్మా ఎగుమతులు 3.25 శాతం పెరిగాయని అన్నారు. చాలా కమోడిటీస్​ అంతగా రాణించని టైములో సవాళ్లను తట్టుకుని మన ఫార్మా ఇండస్ట్రీ ఎగుమతులలో గ్రోత్​ సాధించగలిగిందని ఉదయ భాస్కర్​ వివరించారు. మన దేశపు ఫార్మా ఎగుమతులలో అమెరికాకు 31 శాతం వాటా ఉందని, ఈ ఏడాది ఇవి మరింత పెరిగే ఛాన్స్​ ఉందని పేర్కొన్నారు. రష్యా ఇతర సీఐఎస్​ దేశాలకు ఫార్మా ఎగుమతులు కిందటేడాది 8.42 శాతం తగ్గి 1.15 బిలియన్​ డాలర్లకే పరిమితమయ్యాయని, రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం కూడా ఇందుకు ఒక కారణమని చెప్పారు. ఇండియాలోని ఫార్మా యూనిట్ల తనిఖీలో యూఎస్​ ఎఫ్​డీఏ ఇంకా జోరు పెంచలేదని, కొవిద్​ ముందు లెవెల్​కు తనిఖీలు ఇంకా చేరలేదని ఉదయ భాస్కర్​ వివరించారు. ఈ విషయంలో కామర్స్​ మినిస్ట్రీ అమెరికా ప్రభుత్వంతో మాట్లాడుతోందని పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)