ఏడాదిలో 300 రోజులు కాలుష్యమే !

Telugu Lo Computer
0

దక్షిణాది రాష్ట్రాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉన్న సిటీల జాబితాలో హైదరాబాద్  మొదటి స్థానంలో ఉంది. గ్రీన్​ పీస్ ఇండియా అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థ చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దక్షిణాదిన బెంగళూరు, చెన్నై, కొచ్చి సిటీలతో పోలిస్తే హైదరాబాద్​లో పీఎం (పార్టిక్యులేట్ మ్యాటర్) 2.5, పీఎం10 కాలుష్య కారకాల స్థాయిలు అధికంగా ఉన్నట్టు తేలింది. దేశంలోని11 సిటీల్లో కాలుష్య పరిస్థితిపై ఆ సంస్థ అధ్యయనం చేసింది. ఈ ఏడాది మార్చిలో ఐక్యూ ఎయిర్ రిలీజ్ చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్​లోనూ హైదరాబాద్​లో పొల్యూషన్ తీవ్రంగా ఉన్నట్టు వెల్లడైంది. రెండు నివేదికల్లోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కన్నా కాలుష్య కారకాలు ఎక్కువగానే ఉంటున్నాయని తేలింది. హైదరాబాద్  సిటీలో ఏడాది పొడవునా వాయు కాలుష్యం ఉంటున్నదని రిపోర్ట్​లో తేలింది. 300 రోజుల పాటు అత్యంత హానికరమైన పీఎం 2.5 కాలుష్యకారకాలు అధికంగా విడుదలవుతున్నాయి. ఒక్క క్యూ బిక్ మీటర్ గాలిలో 40.91 మైక్రోగ్రాముల మేర పీఎం 2.5 కాలుష్య కారకాలుంటున్నాయి. ఇది డబ్ల్యూహెచ్​వో సూచించిన ప్రమాణాల కన్నా 8.2 రెట్లు అధికం. డబ్ల్యూహెచ్​వో లెక్కల ప్రకారం క్యూబిక్ మీటర్ గాలిలో 5 మైక్రోగ్రాముల వరకే పీఎం 2.5 ఉంటేనే ఆ వాతావరణం సేఫ్. క్యూబిక్ మీటర్ గాలి లో 57.84 గ్రాముల మేర కాలుష్య కారకాలుంటున్నట్టు తేలింది. డబ్ల్యూహెచ్​వో నిర్దేశించిన 15 మైక్రోగ్రాముల కన్నా ఇవి 3.9 రెట్లు ఎక్కువ. గాలిలో నైట్రోజన్​ డై ఆక్సై డ్ స్థాయిలు డబ్ల్యూహెచ్​వో నిర్దేశించిన10 మైక్రోగ్రాముల కన్నా 1.7 రెట్లు ఎక్కువగా.. అంటే 17.06 మైక్రోగ్రాముల మేర నైట్రోజన్​ డై ఆక్సైడ్ గాలిలో ఉంటున్నది. హైదరాబాద్​తో పోలిస్తే ఇతర ప్రధాన దక్షిణాది సిటీ లైన బెంగళూరు, చెన్నై, కొచ్చిల్లో పొల్యూషన్ తక్కువ గానే రికార్డవుతున్నట్టు రిపోర్ట్​లో వెల్లడైంది. పీఎం 2.5 స్థాయిలు బెంగళూరులో 29.01 మైక్రోగ్రాము లు, కొచ్చిలో 24.11 మైక్రోగ్రాములు, చెన్నైలో 23. 81 మైక్రోగ్రాముల మేర ఉంటున్నది. ఇటు పీఎం 10 స్థాయిలు కూడా ఆయా సిటీల్లో 55.14 మైక్రోగ్రాములు, 37.99 మైక్రోగ్రాములు, 45.9 మైక్రోగ్రాముల మేర గాలిలో ఉంటున్నట్టు తేలింది. డబ్ల్యూహెచ్​వో నిర్దేశించిన ప్రమాణాలతో పోలిస్తే ఇవి ఎక్కువే అ యినా.. హైదరాబాద్​తో పోలిస్తే ఈ దక్షిణాది సిటీల్లో పొల్యూషన్​ తక్కువగానే ఉన్నట్టు రిపోర్ట్​లో తేలింది. మూడు నెలల కింద ఐక్యూ ఎయిర్ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్​లోనూ హైదరాబాద్​లోనే కాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఆరు ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలైన ఢిల్లీ, ముంబై, కోల్​కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్​లలో.. అత్యధికంగా బెంగళూరు, హైదరాబాద్​లలోనే కాలుష్యం పెరుగుతున్నదని ఆ రిపోర్ట్​ తేల్చింది. ఆ రిపోర్ట్​ ప్రకారం పీఎం 2.5 కాలుష్య కారకాలు క్యూబిక్​ మీటర్ గాలిలో 42.4 మైక్రోగ్రాముల మేర ఉంటున్నట్టు తేలింది.

Post a Comment

0Comments

Post a Comment (0)