26న మరో 5 వందే భారత్ రైళ్ల ప్రారంభం

Telugu Lo Computer
0


జూన్ 26న ప్రధాని మోడీ మరో 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని వీటిని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ముంబై-గోవా, బెంగళూరు-హుబ్లీ, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్పూర్ రూట్లలో వీటిని ప్రారంభించనున్నారు. ముంబై-గోవా వందే భారత్ ట్రైన్ ని ఇది వరకే ప్రారంభించాల్సి ఉన్నా ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటన కారణంగా వాయిదా వేశారు. ఐదు వందే భారత్ రైళ్లను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు పలు రూట్లలో 17 వందే భారత్ ఎక్స్ ప్రెసులు నడుస్తున్నాయి. వీటికి తోడుగా మే 26 నుంచి మరో ఐదు రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెలలో అన్ని రాష్ట్రాలకు వందేభారత్ రైలు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ రైల్వేలో ఆధునాతనమైన రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు పలు మార్గాల్లో రైళ్ల వేగాన్ని పెంచేందుకు, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిచాలనే ఉద్దేశంతో వందే భారత్ రైల్ ప్రాజెక్టును ప్రారంభించారు. పూర్తిగా దేశీయంగా ఈ రైళ్లను తయారు చేస్తున్నారు. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం భారత్ లో ఉన్న రైల్వే మార్గాలు అంత స్పీడ్ కు అనుకూలంగా లేకపోవడంతో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకే అనుమతి ఉంది. రానున్న కాలంలో మరింత వేగంగా వెళ్లేందుకు రైల్వే ట్రాకులను అప్ గ్రేడ్ చేయాలని రైల్వే భావిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)