17 ఏళ్ళ తర్వాత సీబీఐ చార్జిషీట్ దాఖలు ?

Telugu Lo Computer
0


2007లో జరిగిన పప్పు దినుసుల కుంభకోణంపై 17 ఏళ్ల తర్వాత సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. పప్పు దినుసుల ధరలను అదుపు చేసేందుకు అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వాటి ఎగుమతులను నిషేధించినా 60 వేల మెట్రిక్ టన్నుల పప్పు దినుసులను మన దేశం నుంచి 3 దేశాలకు ఎగుమతి చేశారు. ఎగుమతులపై నిషేధం అమల్లో ఉన్నా పాత తేదీలు వేసి ప్రభుత్వం ఎగుమతులను కొనసాగించిందని అప్పట్లో ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. దీంతో ఆ ఏడాదే సీబీఐ కేసు నమోదు చేసింది. కానీ చార్జిషీట్ దాఖలు కావడానికి 17 ఏళ్ళ టైం పట్టడం గమనార్హం. పప్పు దినుసులు ఎగుమతి చేసిన మూడు దేశాలకు పంపిన లేఖలకు జవాబులు రావడంలో ఆలస్యం జరిగినందు వల్లే దర్యాప్తు ఆలస్యమై, చార్జిషీట్ దాఖలులో తీవ్ర జాప్యం జరిగిందని సీబీఐ వర్గాలు తెలిపాయి. జెట్ కింగ్, ఆ సంస్థ యజమాని శ్యాం సుందర్ జైన్ తో పాటు నరేష్ కుమార్ జైన్, ప్రశాంత్ సేథిలపై విచారణ జరిపినట్లు చార్జిషీట్ లో పేర్కొన్నారు. ఈ కేసులో సమాచారాన్ని పంచుకోవడంలో సహాయం కోరుతూ న్యూజిలాండ్ కు కోర్టు పంపిన న్యాయపరమైన అభ్యర్థన ఇప్పటికీ పెండింగ్ లో ఉందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. మన దేశంలో పప్పు ధాన్యాల ధరలను అదుపు చేసేందుకు, డిమాండ్-సరఫరా అంతరాన్ని తగ్గించడానికి  యూపీఏ ప్రభుత్వం 2006, 2008 సంవత్సరాల్లో రెండు పథకాలను తీసుకొచ్చింది. 2006 మేలో ప్రారంభించిన మొదటి పథకం నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ఖాతాలో పప్పులను దిగుమతి చేసుకోవడానికి, ఏదైనా నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయడానికి (రీయింబర్స్‌మెంట్) అనుమతించడం. రీయింబర్స్‌మెంట్ అనేది సరుకుల కనీస ధరలో 15 శాతం వరకు ఉంటుంది. ఈ పథకాన్ని 2011 వరకు పొడిగించారు. మరో పథకాన్ని  యూపీఏ ప్రభుత్వం 2008 నవంబర్ 20న ప్రవేశపెట్టింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు పప్పు దినుసులను దిగుమతి చేసుకునేందుకు సంబంధించినది.

Post a Comment

0Comments

Post a Comment (0)