నిర్వాసితులకు 15 రోజుల్లో తాత్కాలిక గృహాలు !

Telugu Lo Computer
0


మణిపూర్‌ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. జాతి హింసలో నిరాశ్రయులైన వారిని ప్రభుత్వం ఆదుకోనుంది. మొదటి ప్రాధాన్యతను నిర్వాసితులను ఆదుకోవడమేనని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా జాతి హింసలో నిరాశ్రయులైన నిర్వాసితులకు 15 రోజుల్లో తాత్కాలిక గృహాలను నిర్మించి ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా తాత్కాలికంగా నిర్మించే ఇళ్లను నిరాశ్రయులైన నిర్వాసితులకు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ ప్రకటించారు. గత నెల నుండి మణిపూర్‌లో చెలరేగుతున్న జాతి హింసలో నిర్వాసితులైన వారి కోసం 15 రోజుల్లో తాత్కాలిక గృహాలను ఏర్పాటు చేసి ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించారు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది. ఇప్పుడు దయచేసి శాంతికి అవకాశం ఇవ్వండని సీఎం విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ప్రాంతాలలో తమ ఇళ్ల నుండి నిర్వాసితులైన వేలాది మంది ప్రస్తుతం ప్రభుత్వ శిబిరాల్లో ఉన్నందున వారిని ఆదుకోనున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాజకీయంగా అత్యాశతో కూడిన అంశాలే రాష్ట్రంలోని ఈ పరిస్థితికి కారణమయ్యాయని అన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా క్షేత్రస్థాయిలో పనులు చేయడం ప్రారంభించాయన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో చీలికవర్గంగా ఉన్న సాయుధ తీవ్రవాదులు ఉన్నారని సీఎం బీరెన్‌ సింగ్‌ మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాకు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)