మసీదులో హిందువుల పెళ్లి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 4 May 2023

మసీదులో హిందువుల పెళ్లి !


మ్యూజిక్తో మ్యాజిక్ చేసే ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియాలోనూ విభిన్న పోస్టులు పెడుతూ నెటిజన్స్ను ఆలోచింపజేస్తుంటాడు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మసీదులో హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన పెళ్లి వీడియోని రెహమాన్ షేర్ చేశాడు. కేరళ అలప్పుజలోని చెరువల్లిలోని ఒక మహిళ తన కూతురు పెళ్లి చేయడానికి ఆర్ధికంగా ఇబ్బంది పడుతోంది. దీంతో తన కూతురు వివాహానికి సాయం చేయాలంటూ అక్కడి మసీద్‌ కమిటీని ఆశ్రయించింది. ఆమె పరిస్థితి అర్ధం చేసుకున్న మస్లిం పెద్దలు ఆర్థిక సాయం చేయడంతో పాటు మసీద్ లోనే హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా ఆమె కూతురు పెళ్లి తంతు గ్రాండ్ గా నిర్వహించారు. మతసామరస్యాన్ని చాటిచెప్పిన ఈ పెళ్లి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెళ్లి కూతురికి 10 తులాల బంగారం, 20 లక్షల క్యాష్ కానుకగా ఇచ్చారు. ఇక పెళ్లి వచ్చిన 1000 మందికిపైగా అతిథులకు వెజ్ అండ్ నాన్ వెజ్ విందు ఏర్పాటు చేశారు. దేశంలో మతాల పేరుతో జరుగుతున్న హింసని ఆపేలా మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మసీదులో హిందూ సంప్రదాయ పద్దతిలో పెళ్లిని ఘనంగా చేసినట్లు ఆ ఊరి పెద్దలు చెప్పారు. ఇక ఈ ఘటనపై స్పందించిన రెహమాన్ దాన్ని ట్వీట్ చేస్తూ.. "మీ మానవత్వానికి జోహార్లు. బేధాలు లేకుండా చేసిన మీ పని వ్యవస్థని మార్చేలా ఉంది" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

No comments:

Post a Comment