బైక్‌లను కొట్టేస్తున్న ఆర్మీ కానిస్టేబుల్ అరెస్టు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 19 May 2023

బైక్‌లను కొట్టేస్తున్న ఆర్మీ కానిస్టేబుల్ అరెస్టు !


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో వాహనాలు తస్కరిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా స్టన్ అయ్యే విషయాలు వెలుగు చూశాయి. అనంతపురం సిటీ ప్రియాంక నగర్‌కు చెందిన గులాం సద్దాం హుస్సేన్ టెన్త్ వరకు చదివాడు. అతడికి 2011లో ఆర్మీ సహస్రాసీమబల్‌లో కానిస్టేబుల్‌గా జాబ్ వచ్చింది. ప్రస్తుతం అసోంలో డ్యూటీ చేస్తున్నాడు. హుస్సేన్ కొంతకాలంలో వ్యవసనాలకు బానిసయ్యాడు. పీకలదాకా మద్యం సేవించడం, పేకాట ఆడటం వంటివి చేసేవాడు. వచ్చే శాలరీ మొత్తాన్ని దుబారాగా ఖర్చు చేసేవాడు. అవి చాలవన్నట్లు అప్పులు కూడా చేశాడు. తన ఇబ్బందులను గార్లదిన్నె మండలం పెనకచెర్లకు చెందిన స్నేహితుడు రాజశేఖర్‌కు చెప్పుకున్నాడు సద్దాం. తాను బైక్‌లు దొంగిలించి అమ్మి సొమ్ము చేసుకుంటానని, ఈజీగా డబ్బు సంపాదించవచ్చని రాజశేఖర్ ఉచిత సలహా ఇచ్చాడు. ఈ ఐడియా సద్దాం హుస్సేన్‌కు బాగా నచ్చింది. అస్సాం నుంచి సెలవు పెట్టి వచ్చి స్థానికంగా బైక్‌లు కొట్టేయడం ప్రారంభించాడు.  అలా కొట్టేసిన పలు బైక్‌లను అనంతపురం శివారులో ఉన్న నేషనల్‌ పార్క్‌ సమీపంలో ఓ పాడుబడిన షెడ్డులో దాచారు. బైక్ చోరీలు గురించి పదే, పదే కంప్లైంట్స్ రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో గుత్తిరోడ్డులోని మార్కెట్‌యార్డ్‌ దగ్గర ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈజీ మనీ కోసం చోరీలు చేసిన ఆర్మీ కానిస్టేబుల్ పోలీసులకు దొరికిపోయాడు. నిందితుల వద్ద నుంచి 17బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

No comments:

Post a Comment