టైర్ల కింద రెండేళ్ల చిన్నారి తల ఛిద్రం !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌, హయత్‌నగర్‌లో భవన నిర్మాణ పనులు చేసుకుంటున్న మహిళ సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో మూడేళ్ల కూతుర్ని వదిలివెళ్లింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన కారు చిన్నారి శరీరంపై వెళ్లడంతో చిన్నారి ప్రాణాలు విడిచింది. పార్కింగ్ ప్లేస్‌లో అమర్చిన సీసీ కెమెరాలో చిన్నారి కారు చక్రాల కిందపడి నలిగిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. యాక్సిడెంట్‌ వీడియో వైరల్ అవుతోంది. కర్నాటకకు చెందిన కవిత, రాజు దంపతులు. కవిత దంపతులకు మూడేళ్ల వయసున్న కొడుకు, కూతురు ఉన్నారు. పని చేస్తున్న పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ పార్కింగ్ ప్రదేశంలో వదిలిపెట్టింది. పార్కింగ్‌ ప్లేసులో కారు పెట్టేందుకు అపార్ట్‌మెంట్‌లో ఉండే ఓ వ్యక్తి చిన్నారిని చూసుకోలేదు. దాంతో కారు బాలిక శరీరంపై నుంచి పోయింది. కారు నడిపిన వ్యక్తి నిర్లక్ష్యానికి ఖరీదుగా చిన్నారి ప్రాణం పోయింది. కారు చక్రాల కింద చిన్నారి  కారు చక్రాలు శరీరంపై నుంచి పోవడంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అక్కడే మృతి చెందింది. స్థానికులు చూసి గట్టిగా అరవడంతో తల్లిదండ్రులు వచ్చి చనిపోయిన చిన్నారి మృతదేహం దగ్గర బోరున విలపించారు. పొట్టకూటి కోసం కూలీ పనులకు వచ్చిన మహిళ బిడ్డను కోల్పోవడం చూసి స్థానికులు కన్నీటిపర్యంతమైంది. చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)