ఓఆర్ఆర్ లీజు విషయంలో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 7 May 2023

ఓఆర్ఆర్ లీజు విషయంలో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు !


ఓఆర్ఆర్ ని 30 ఏళ్ల పాటు ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియ జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.  హెచ్ఎండీఏకు టోల్ ద్వారా 30 ఏళ్లలో రూ.75 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. లీజ్ కు ముందే ఏ కంపెనీకి టెండరు రావాలో సీఎం కేసీఆర్ ముందే నిర్ణయించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఓఆర్ఆర్ పేరుతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం నయా కుంభకోణానికి పాల్పడుతోందని కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని చెప్పే బీఆర్ఎస్ ఓఆర్ఆర్ ను ఎందుకు లీజ్ కు ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్ హెచ్ ఏఐ నిబంధనల ప్రకారమే లీజు ప్రక్రియ జరిగిందని బీఆర్ఎస్ చెప్పడం అవాస్తవమని అన్నారు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యను బట్టి లీజు పరిమితిని తగ్గించుకోవచ్చని నిబంధనల్లో ఉందని, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదన్నారు. ఓఆర్ఆర్ లీజు తమ అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తోందని అన్నారు. ఓఆర్ఆర్ పేరుతో నయా కుంభకోణానికి పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి తీవ్ర విమర్శించారు. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని చెప్పే బీఆర్ఎస్ ఓఆర్ఆర్ ను ఎందుకు లీజ్ కు ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్ హెచ్ ఏఐ నిబంధనల ప్రకారమే లీజు ప్రక్రియ జరిగిందని బీఆర్ఎస్ చెప్పడం అవాస్తవమని అన్నారు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యను బట్టి లీజు పరిమితిని తగ్గించుకోవచ్చని నిబంధనల్లో ఉందని, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియ జరిగిందన్నారు. హైదారాబాద్ అభివృద్ధిని అంచనా వేసి 10 శాతం వృద్ధి లెక్కకట్టినా.. ఓఆర్ఆర్ ద్వారా 75 వేల కోట్లు వస్తుందని చెప్పారు. మరి గుణాత్మకమైన మార్పును తెస్తామన్న కేసీఆర్ సర్కార్.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసారు. హైదరాబాద్ లో కోట్ల విలువ చేసే భూములు ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఓఆర్ఆర్, హైదరాబాద్ భూములపై విచారణ చేయిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. తప్పు చేసింది ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు.

No comments:

Post a Comment