ప్రి వెడ్డింగ్ షూట్లు మహిళలకు హానికరం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 11 May 2023

ప్రి వెడ్డింగ్ షూట్లు మహిళలకు హానికరం !


ఛత్తీస్ గడ్ రాయ్ పూర్ లో మే 9న కిరణ్మయి నాయక్ అధ్యక్షతన 172వ పబ్లిక్ హియరింగ్ జరిగింది. ఇందులో భార్యభర్తల మధ్య వివాదాల కేసులే ఎక్కువగా లిస్టింగ్ కు వచ్చాయి. ఇందులో ఓ కేసును పరిశీలించిన మహిళ కమిషన్ చైర్‌పర్సన్ కిరణ్మయి నాయక్ ఈ రోజుల్లో ప్రజలు పాశ్చాత్య సంస్కృతి ద్వారా ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని, ఇది మన భారత సంస్కృతిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్ కోసం పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లను నివారించాలని కోరారు. ఇది ఒకవేళ పెళ్లిళ్లు విఫలం అయినప్పుడు, విడాకుల వరకు వెళ్తే అమ్మాయిలకు హానికరంగా మారే అవకాశం ఉందని అన్నారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి డేట్ ఫిక్స్ అయిన పెళ్లి జరగలేదని ఒకరు కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే హియరింగ్ సమయంలో ఈ కేసును విత్ డ్రా చేసుకున్నారు. ఇరు పక్షాలు పెళ్లి ఏర్పాట్లకు, ఫోటోలకు, ప్రీ వెడ్డింగ్ షూట్లకు పెట్టిన ఖర్చులను చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాయని, ఫ్రీ వెడ్డింగ్ వీడియోలను, ఫోటోలను డిలీట్ చేసేలా ఒప్పందం కుదరిందని కమిషన్ ముందు తెలిపారు. భవిష్యత్తులో ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ కాకుండా ఈ చర్యలు తీసుకున్నారని దరఖాస్తుదారు చెప్పారు.

No comments:

Post a Comment