బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో తాజాగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉదయం 8:30 నిమిషాలకు ఆగ్నేయ బంగాళాఖాతం గగనతలంపై ఈ ఆవర్తనం ఏర్పడినట్టు కోల్‌కతలోని భారత వాతావరణ కేంద్రం రీజినల్ డైరెక్టర్ డాక్టర్ జీకే దాస్ తెలిపారు. 8వ తేదీ నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని, 9వ తేదీ నాటికి పెను తుఫాన్‌గా రూపాంతరం చెందుతుందని వివరించారు. దీని ప్రభావంతో తమిళాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ప్రస్తుతం మోచా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్‌కు తోడుగా తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ప్రత్యేకించి ఒడిశాపై దీని ప్రభావం అధికంగా ఉంటోంది. 18 జిల్లాల్లో ఒడిశా ప్రభుత్వం హైఅలర్ట్ జారీ చేసింది. బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రపారా, కటక్, పూరీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)