హైదరాబాద్‌లో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ నగరంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌ నగర్‌, యూసుఫ్‌గూడ, మణికొండ, టోలీచౌకి, గచ్చిబౌలి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. నగరంలో భారీ ఈదురుగాలులతో వర్షం కురియడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే షేక్‌పేట, నార్సింగ్‌, మెహిదీపట్నం, కూకల్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయితే హైదరాబాద్‌లో మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నగర వాసులు బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షం కారణంగా సహాయం కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)