ట్రాలీని ఢీకొట్టిన బస్సు : నలుగురి మృతి - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 18 May 2023

ట్రాలీని ఢీకొట్టిన బస్సు : నలుగురి మృతి


మధ్యప్రదేశ్ లో ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్ బస్  ఓ ట్రాలీ ఢీకొట్టింది. దీంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద ధాటికి బస్సు నుజ్జునుజ్జయింది. మధ్యప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న స్లీపర్ బస్ షాజాపూర్ వద్ద ట్రాలీకి ఢీ కొందని అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయాలపాలైనవారిని వెంటనే ఉజ్జయిలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో కోల్పోయిన నలుగురి వివరాల గురించి తెలియరాలేదు. బస్సు, ట్రాలీ వేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

No comments:

Post a Comment