పక్క దేశాలకు వెళ్లే రైళ్లు

Telugu Lo Computer
0


విదేశాలకు ప్రయాణించే భారతీయ రైళ్లు కూడా వున్నాయి. వీటిని బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లకు నడపుతున్నారు. కొన్ని రైళ్లను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. రైలులో విదేశాలకు వెళ్లానుకుంటే పాస్ పోర్టు, ప్రయాణానికి అనుమతి కలిగివుండాలి. వీటితోపాటు టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 2017లో బంధన్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించారు. భారత్ - బంగ్లాదేశ్ మధ్య నడుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారు. కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌లోని ఖుల్నా వరకు నడుస్తుంది. మైత్రి ఎక్స్‌ప్రెస్ ను 2008లో ప్రారంభించారు. కోల్‌కతా నుంచి ఢాకా వరకు 375 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు తప్పనిసరిగా వీసా ఉండాలి. రెండు ప్రధాన నదుల గుండా మైత్రీ ఎక్స్‌ప్రెస్ వెళుతుంది. పద్మ నదిపై 100 సంవత్సరాల నాటి హార్డింజ్ వంతెన, జమున నదిపై బంగబంధు వంతెన మీదుగా ఇది ప్రయాణిస్తుంది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ భారత్‌ అట్టారీ సరిహద్దు నుంచి పాకిస్తాన్‌లోని లాహోర్ వరకు ఇది నడుస్తోంది. ప్రస్తుతం దీన్ని నిలిపివేశారు. దీంతోపాటు మరొక రైలు థార్ ఎక్స్‌ప్రెస్ లింక్ భారత్‌లోని జోధ్‌పూర్ నుంచి పాకిస్తాన్‌లోని కరాచీకి నడిచేది. 41 సంవత్సరాల తర్వాత 2006లో దీన్ని పునరుద్ధరించారు. 2019లో నిలిపేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో సంఝౌతాను ఆపేశారు. మూడున్నర సంవత్సరాలుగా ఇది నిలిచిపోయివుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)