ఒకే విధమైన విడాకుల చట్టాన్ని రూపొందించండి !

Telugu Lo Computer
0


ఏకీకృత విడాకుల చట్టాన్నిరూపొందించాలని క్రికెటర్ మహమ్మద్ షమీ భార్య వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విడాకుల అంశాలపై ఉన్న ఇతరు పిటీషన్లతో షమీ భార్య అభ్యర్థనను కూడా సుప్రీం జోడించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ప్రక్రియ చేపట్టింది. అడ్వకేట్ దీపక్ ప్రకాశ్ ఈ అభ్యర్థనను ఫైల్ చేశారు. ఎక్స్‌ట్రా జుడిషియల్ తలాక్‌, తలాక్‌-ఉల్‌-హసన్ లాంటి ఏకపక్ష విధానాలతో విసుగెత్తిపోయినట్లు షమీ భార్య తన అభ్యర్థనలో తెలిపారు. 2022, జూలై 23వ తేదీన తలాక్ ఉల్ హసన్ కింద తనకు షమీ నుంచి విడాకుల పిటిషన్ అందినట్లు ఆమె తెలిపారు. తలాక్ ఉల్ హసన్ కింద అనేక మంది విడాకులు తీసుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. లింగ బేధం లేకుండా, మత తటస్టమైన ఏకీకృత విడాకుల విధానాన్ని తయారు చేయాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. తలాక్ ఈ హసన్ అన్న విధాన్ని అప్రజాస్వామికమని ప్రకటించాలన్నారు. 1939 నాటి ముస్లిం మ్యారేజ్‌చట్టాన్ని రద్దు చేయాలని పిటిషనర్ కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)