వారెవ్వా మర్కటానికే మస్కా కొట్టింది ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 26 May 2023

వారెవ్వా మర్కటానికే మస్కా కొట్టింది !


ఓ యువకుడు తన దారి తాను పోతుంటే వెనకాలే ఓ కోతి వచ్చి చటుక్కున అతని కళ్లజోడు ఎత్తుకుపోయింది. అతను గిరుక్కున వెనుతిరిగి చూసేటప్పటికే ఆ కోతి ఆ కళ్లజోడును తన కళ్లకు పెట్టేసుకుంది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. కోతి తెలివిగా తీసేసుకున్న కళ్లజోడును తిరిగి పొందేందుకు ఓ మహిళ చూపిన చాకచక్యం చూస్తే వారెవ్వా మర్కటానికే మస్కా భలే కొట్టిందే అనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళ సమయస్ఫూర్తికి ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి కళ్లజోడు పెట్టుకుని మెట్లను ఎక్కుతుండగా అపక్కనే గోడ మీద నుంచి తాపీగా నడుచుకుంటూ వచ్చిన ఓ కోతి చటుక్కున ఆ వ్యక్తి కళ్లజోడును గుంజుకుని వెనక్కి వెళ్లి అంతే తాపీగా ఓ మూల కూర్చుండటం కనిపిస్తుంది. కళ్లజోడును కోతి ఆసక్తిగా పరిశీలిస్తుండగా ఓ మహిళ కోతి దగ్గరగా వెళ్లి ఓ పండు ఇస్తుంది. దాన్ని కోతి తీసుకుంటుంది. మరో పండు ఇస్తుందామె. దాంతో కోతి కళ్లు జోడు కింద పెట్టి ఆ రెండో పండును అందుకుంటుంది. అంతే ఆమె కళ్లజోడు తీసుకుని వచ్చేస్తుంది. కోతి దృష్టి పండ్ల మీద ఉండగానే ఇదే అదనుగా మహిళ కళ్లజోడును దాన్నుంచి తీసుకుని ఆ వ్యక్తికి ఇచ్చేస్తుంది.ఈ వీడియోను ఏకంగా పది లక్షల మంది వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు వారెవ్వా ఆమెది భలే తెలివిగా మర్కటాన్ని మస్కా కొట్టించింది అంటున్నారు.

No comments:

Post a Comment