మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను ఎంఐఎం పార్టీ నడిపిస్తోంది ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 21 May 2023

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను ఎంఐఎం పార్టీ నడిపిస్తోంది !


హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను ఎంఐఎం పార్టీ నడిపిస్తోంది. మహారాష్ట్రలో ఒక వార్డు మెంబర్‌ గెలిచినందుకే సంబురపడిపోతున్నారు. మా పార్టీ జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవడం సహజం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు అవకాశమే లేదు. అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలు బేస్‌లెస్‌. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌ మా చేతుల్లో లేదు. ఇది సీబీఐ పరిధిలోని అంశం. మేము అవినీతికి పాల్పడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను జైలుకు పంపించాం​. 2వేల రూపాయల నోట్ల ఉపసంహరణను అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారు. నోట్ల రద్దులో మా ప్లాన్‌ మాకుంది. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణలో ఉండదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు. బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

No comments:

Post a Comment