కాంగ్రెస్ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చా !

Telugu Lo Computer
0


కర్నాటక ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ డీకే శివకుమార్ తన మద్దతుదారులతో భేటీ అయిన తర్వాత కీలక కామెంట్స్ చేశారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ కోసం తాను చాలా కష్టపడ్డానని వివరించారు. ఎన్నికలో బరిలోకి తాను ధైర్యంగా ముందుకు దూకి.. తన అధ్యక్షతన 135 సీట్లు సాధించానని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాననన్నారు. ఎలక్షన్స్ ముందు కూడా కాంగ్రెస్ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చానని చెప్పారు. కాంగ్రెస్ నేతలంతా గెలుపు కోసం తనకు సహకరించారని వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విబేధాలు లేవన్నారు డీకే శివకుమార్. తన బర్త్ డే వేడుకల్లోనూ సిద్ధ రామయ్య పాల్గొన్నారని చెప్పారు. కర్నాటక ముఖ్యమంత్రి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటుందని తాము భావిస్తున్నామని చెప్పారు. సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గే సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. సీఎం ఎవరన్నదానిపై హైకమాండ్ దే తుది నిర్ణయమని వ్యాఖ్యానించారు. ''నేను సింగిల్ మ్యాన్. నాకంటూ మద్దతుదారుల సంఖ్యను చెప్పను. మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోంది. 15మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీడి.. వెళ్లినా తాను ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. ఎలక్షన్స్ ముందు బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లినా.. ఎక్కడా ధైర్యం కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాను. నన్ను నమ్మి ఓటర్లు 135 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు'' అని డీకే శివకుమార్ కామెంట్స్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)