శరద్ పవార్ నివాసంలో మహా వికాస్ అఘాడి సమావేశం !

Telugu Lo Computer
0


కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం, కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం మహారాష్ట్రలోని ''మహా వికాస్ అఘాడి''లో నూతనోత్సాహాన్ని నింపింది. మహారాష్ట్రలో రాబోయే ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కోవాలనే దృఢ సంకల్పంతో ఎంపీఏ నేతలు ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ అధ్యక్షతన ఆయన నివాసంలో నేతలంతా సమావేశమయ్యారు. 'మహా వికాస్ అఘాడి'లో కాంగ్రెస్, ఎన్‌సీ, శివసేన (యూబీటీ) భాగస్వాములుగా ఉన్నాయి. పవార్ నివాసంలో జరిగిన ఎంవీఏ సమావేశంలో ఆయనతో పాటు శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఆయన వర్గం ఎంపీ సంజయ్ రౌత్, కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, అజిత్ పవార్, బాలాసాహెబ్ థోరట్ తదితర నేతలు పాల్గొన్నారు. 2024 లోక్‌సభ, విధానసభ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఫార్ములా గురించి ప్రధానంగా నేతలు చర్చించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఎంవీఏ సమావేశానికి ముందు సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ''మోడీ వేవ్ ముగిసిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మా వేవ్ (విపక్షాల) నడుస్తోంది. ఇవాల్టి నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల కోసం మా అపరేషన్ మొదలవుతోంది. శరద్ పవార్ అధ్యక్షతన సమావేశం అవుతున్నాం. 2024 ఎన్నికలపై సమావేశంలో చర్చించి, అందుకోసం సన్నాహకాలు మొదలపెట్టనున్నాం'' అని రౌత్ చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)