ఇది దేశాన్ని ఏకం చేసే రాజకీయ విజయం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 13 May 2023

ఇది దేశాన్ని ఏకం చేసే రాజకీయ విజయం !


కర్ణాటకలో కాంగ్రెస్ అఖండ విజయం దేశాన్ని ఏకం చేసే రాజకీయ విజయంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభివర్ణించారు. విజయానికి దోహదం చేసేలా పార్టీ ఘనంగా పనిచేసిందని ప్రశంసించారు. ఈమేరకు శనివారం హిందీలో ట్వీట్ చేశారు. ఇది కర్ణాటక ప్రగతి ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చే విజయంగా పేర్కొన్నారు. కర్ణాటక కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కష్టించి పనిచేశారని, ఈ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు ఇచ్చిన ఐదు హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ పట్టుదలతో పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఇచ్చిన హామీలను ఉదహరించారు. " ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (గృహజ్యోతి), కుటుంబాన్ని నడిపే మహిళకు నెలనెలా రూ.2000 ఆర్థికసాయం (గృహలక్ష్మి),దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం (అన్న భాగ్య), నిరుద్యోగులైన యువతకు ప్రతినెలా రూ. 3000, నిరుద్యోగులైన డిప్లొమా హోల్డర్లకు నెలనెలా 1500. (1825 ఏళ్ల వయసు వారికి) రెండేళ్ల పాటు ఆర్థికసాయం (యువనిధి),ప్రజారవాణా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం (శక్తి) హామీలను గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ 13 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇవికాక 12 రోడ్‌షోల్లో ప్రచారం సాగించారు. రెండు మహిళా సమావేశాలు, కార్మికుల సమావేశం నిర్వహించారు.

No comments:

Post a Comment