వదంతులు సృష్టించే వారితో చాలా ప్రమాదం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 14 May 2023

వదంతులు సృష్టించే వారితో చాలా ప్రమాదం !


రాజస్థాన్‌లోని నాగౌర్‌లో జరిగిన ఓ ర్యాలీలో గెహ్లాట్ మాట్లాడుతూ, వసంధరా రాజేకు, తనకు మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవన్నారు. ''దీనిపై కొందరు వదంతలు వ్యాప్తి చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకారులు. రాజకీయాల్లో పోరాటం అనేది సిద్ధాంతాలు, విధానాలపై ఉంటాయనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు'' అని గెహ్లాట్ అన్నారు. అవినీతికి సంబంధించిన అంశంపై రాజస్థాన్‌లో సొంత ప్రభుత్వం (కాంగ్రెస్) పైనే సచిన్ పైలట్ ఇటీవల ఒకరోజు నిరాహార దీక్ష జరపారు. ప్రస్తుతం ఐదురోజుల 'జన్ సంఘర్ష్ పాదయాత్ర' జరుపుతున్నారు. పాదయాత్ర సందర్భంలో ఆయన గెహ్లాట్‌పై తాజా ఆరోపణలు చేశారు. గెహ్లాట్ నాయకురాలు సోనియాగాంధీ కాదని, వసుంధరా రాజే అన్నట్టుగా కనిపిస్తోందని చెప్పారు. దీనికి ముందే గెహ్లాట్ ఒక సభలో మాట్లాడుతూ, ఇటీవల తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ప్రయత్నాలు జరిగాయని, అప్పుడు వసుంధరా రాజే, కొందరు ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా నిలిచారని అన్నారు. ఆయన వ్యాఖ్యలను వసుంధరా రాజే వెంటనే ఖండించారు. 2023 ఎన్నికల్లో ఓటమి భయంతోనే గెహ్లాట్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, గెహ్లాట్ తనను అవమానించిన్నట్టు, ఎవ్వరు కూడా ఇంతలా అవమానించలేదని అన్నారు. ఈ క్రమంలోనే గెహ్లాట్‌పై పైలట్ విమర్శలు గుప్పించారు. వసుంధరా రాజే హయాంలో బీజేపీ ప్రభుత్వం జరిగిన అవినీతిపై విచారణ జరపాలని తాను ఎన్నిసార్లు కోరినా గెహ్లాట్ పట్టించుకోవడం లేదని, ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన నాయకురాలు సోనియాగాంధీ కాదని, వసుంధరా రాజే ఆయన నేత అనే అభిప్రాయం కలుగుతోందని అన్నారు.

No comments:

Post a Comment