ఐఆర్‌సీటీసీ ఊటీ ట్రిప్ !

Telugu Lo Computer
0

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ పేరిట హైదరాబాద్ నుంచి ఊటీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. మే 9 నుంచి ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ఊటీ, కున్నూర్, బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్, దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా జలపాతం తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. 5 రాత్రులు, 6 రోజులు కొనసాగుతుంది. మే 9 నుంచి వారానికోసారి (మంగళవారం) సికింద్రాబాద్‌ నుంచి తమిళనాడుకు రైలు (శబరి ఎక్స్‌ప్రెస్‌) అందుబాటులో ఉంటుంది. మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణించాల్సి ఉంటుంది. రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్ కు వెళ్తారు. అక్కడ నుంచి ఊటీకి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అవ్వాలి. తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూపిస్తారు. రాత్రి భోజనం, ఊటీలో బస ఉంటుంది. మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ సందర్శనకు వెళ్తారు. రాత్రికి ఊటీలో బస చేయాలి. నాలుగో రోజు కూనూర్ సందర్శనకు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే భోజనం చేసి బస చేయాలి. ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు పర్యాటకులను తీసుకువెళతారు. మధ్యాహ్నం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి. ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)