ఆపిల్స్ దిగుమతులపై నిషేధం

Telugu Lo Computer
0


కిలో 50రూపాయల కంటే తక్కువ ధరకు దిగుమతి చేసుకున్న ఆపిల్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. బీమా, రవాణ ఖర్చులతో కలిపి ఆపిల్స్ కిలో ధర 50 రూపాయల కంటే తక్కువ ఉంటే వాటి దిగుమతిని నిషేధిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. భూటాన్ దేశం నుంచి ఆపిల్స్ దిగుమతులకు కనీస దిగుమతి ధర నిబంధన వర్తించదు. ఈ ఏడాది భారతదేశం 296 మిలియన్ డాలర్ల విలువైన ఆపిల్స్ పండ్లను దిగుమతి చేసుకుంది. అమెరికా, ఇరాన్, బ్రెజిల్, యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్, బెల్జియం, చిలీ, ఇటలీ, టర్కీ, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పోలాండ్‌లు భారత్‌కు ఆపిల్స్‌ను ఎగుమతి చేసే ప్రధాన దేశాలు. దక్షిణాఫ్రికా నుంచి ఆపిల్స్ దిగుమతులు ఎక్కువ. పోలాండ్ దేశం నుంచి ఆపిల్ దిగుమతులు పెరగ్గా, అమెరికా, యూఏఈ, ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల నుంచి దిగుమతులు తగ్గాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)