కాళీ మాత ఫొటోపై క్షమాపణ చెప్తూ ఉక్రెయిన్‌ ట్వీట్ !

Telugu Lo Computer
0


హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా 'కాళీ మాత' ఫొటోతో ఉక్రెయిన్‌ ఇటీవల ఓ వివాదాస్పద ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది దీనిని హిందువుల మనోభావాలపై ఉక్రెయిన్ దాడి అంటూ పేర్కొన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా కూడా ఉక్రెయిన్‌ తీరుపై మండిపడ్డారు. ఈ చిత్రాన్ని హిందువుల మనోభావాలపై దాడిగా అభివర్ణించారు. ఈ ఫొటోపై ఉక్రెయిన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన ఉక్రెయిన్‌ మంగళవారం క్షమాపణలు చెప్పింది. 'కాళీమాత' ఫొటోతో అభ్యంతరకర ట్వీట్‌ చేసినందుకు గానూ ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ ఝపరోవా విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌ ద్వారా క్షమాపణలు చెప్పారు. @DefenceU హిందూ దేవత కాళిని వక్రీకరించిన రీతిలో చిత్రీకరించినందుకు మేము చింతిస్తున్నాము. ఉక్రెయిన్  ప్రజలు ప్రత్యేకమైన భారతీయ సంస్కృతిని గౌరవిస్తారు. వర్ణన ఇప్పటికే తీసివేయబడింది. పరస్పర గౌరవం, స్నేహం స్ఫూర్తితో సహకారాన్ని మరింత పెంచుకోవాలని కృతనిశ్చయంతో ఉంది" అని ఝపరోవా ట్వీట్‌లో పేర్కొన్నారు. రష్యా లో చమురు డిపోపై దాడి చేసిన తర్వాత వెలువడిన పొగపై కాళీ మాతను తలిపించేలా హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో ను గుర్తు తెచ్చేలా ఓ ఫోటోను ట్వీట్ చేసింది. 'వర్క్ ఆఫ్ ఆర్ట్' అనే క్యాప్షన్‌తో స్కర్టు ధరించిన స్త్రీ బొమ్మను ట్వీట్ చేసింది. కాళీ మాతను పోలినట్లు ఉన్న ఈ ఫొటోను చిత్రీకరించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, భారతీయులు ఉక్రెయిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది 'హిందూ ఫోబియా' అంటూ పలువురు భారతీయులు ఉక్రెయిన్‌ను నిందించారు. హిందువుల పవిత్ర దైవం అయిన కాళీ మాతను ఎగతాళి చేస్తున్నారంటూ మండిపడ్డారు.


Post a Comment

0Comments

Post a Comment (0)