బెంగళూరులో వర్షాల వల్ల జన జీవనం అస్థవ్యస్తం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 23 May 2023

బెంగళూరులో వర్షాల వల్ల జన జీవనం అస్థవ్యస్తం !


బెంగళూరులో వర్షాల వాళ్ళ జన జీవనం అస్థవ్యస్తమైంది. మరో మూడు  రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ ప్రకటనతో భయపడిపోతున్నారు. బెంగళూరు సిటీతో పాటు బెంగళూరు గ్రామీణ, తుమకూరు, మైసూరు, చామరాజనగర, రామనగర, చెన్నపట్టణ, కోలారు, చిక్కబళ్లాపుర, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. రోడ్లన్నీ జలమయం కావడం, కరెంటు కష్టాలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి అర్దరాత్రి వరకు కురిసిన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడి వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలబడడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నీళ్లలో బైక్ లు నడపలేక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బెంగళూరు నగరంలోని కేఆర్ పురం, జయనగర, బీటీఎం లేఔట్, సిల్క్ బోర్డు, తిలక్ నగర్, మెజస్టిక్, మార్కెట్, మహదేవపుర, మారతహళ్లి, వైట్ ఫీల్డ్, ఐటీపీఎల్, బాగ్ మనే తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షపునీరు రోడ్లపై నిలిచిపోవడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై కొమ్మలు పడిపోవడంతో వాహనాల రాకపోవకలకు ఇబ్బంది ఏర్పడింది. మంగళవారం రాత్రి బెంగళూరులోని పలు ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసుల నుంచి వచ్చే వారు ఇంటికి చేరేందుకు అవస్థలు పడ్డారు. బుధవారం ఉదయం సైతం అదే పరిస్థితి నెలకొంది కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాడు. బెంగళూరులో మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment