జైలులోకి కత్తులు ఎలా వచ్చాయి ? - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 8 May 2023

జైలులోకి కత్తులు ఎలా వచ్చాయి ?


తీహార్ జైల్లో రోహిణి కోర్టు కాల్పుల కేసు నిందితుడిగా ఉన్న టిల్లు తాజ్ పురియాను యోగేష్ తుండా ముఠా కొట్టి చంపిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు తీహార్ జైలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జైల్లోకి కత్తులు ఎలా వచ్చాయి? టిల్లు తాజ్ పురియాను తోటి ఖైదీలే కొట్టి చంపుతుంటే మీరేం చేస్తున్నారు? భద్రత విషయం విఫలమయ్యారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారం మొత్తంపై స్టేటస్ రిపోర్టు కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. జైలు సూపరింటెండెంట్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. జైలులో సీసీటీవీ కెమెరాల్లో టిల్లు హత్య దృశ్యాలు మొత్తం రికార్డ్ అయినా కూడా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో కోర్టు అర్థం చేసుకోలేకపోతోందని అంటూ జస్టిస్ జస్మీత్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జైలు కాంప్లెక్స్ లోకి నాలుగు కత్తులు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. జైలు నుంచి సీసీ టీవీ ఫుటేజ్ తెప్పించుకుని మొత్తం వీడియోను జస్టిస్ జస్మిత్ సింగ్ చూశారు. ఆ వీడియోలో 33 ఏళ్ల టిల్లు తాజ్ పురియాను సెల్ నుంచి బయటకు లాక్కొచ్చి కత్తులతో పొడిచి చంపినట్లుగా స్పష్టంగా ఉంది. కాగా..టిల్లు తాజ్ పురియా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని..తమకు రక్షణ కల్పించాలని కోరుతు టిల్లు తండ్రి, సోదరులు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో తీహార్ జైల్లో జరిగిన టిల్లు హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ మొత్తాన్ని పరిశీలించిన న్యాయమూర్తి అసహనం వ్యక్తంచేశారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని..జైలులో జరిగిన ఘటనకు బాధ్యులైన అధికారుల గురించి తమకు తెలియజేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను హైకోర్టు ఆదేశించారు. కాగా తమ భద్రత కల్పించాలని టిల్లు కుటుంబ సభ్యులు వినతిని పరిశీలించాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించారు. తీహార్ జైల్లో గ్యాంగ్ స్టర్ టిల్లు తాజ్ పురియాను చంపటానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ రెక్కలతో కత్తులు తయారు చేశారని, బెడ్ షీట్ల సహాయంతో టిల్లు సెల్ లోకి చొరబడి అతనిని కొట్టి చంపారని పోలీసు వర్గాలు తెలిపాయి. 2021లో ఢిల్లీ కోర్టులో గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగీని హత్య చేయడం వెనుక టిల్లు తాజ్‌పురియా హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో మే 2న తీహార్ జైలులో పదునైన ఆయుధాలతో ప్రత్యర్థి ప్రత్యర్థి యోగేష్ తుండా ముఠా దాడి చేసి చంపారు. కానీ ఇదంతా తెలిసినా జైలులో పోలీసు సిబ్బంది వారిని అడ్డుకునే యత్నం చేయలేదు. ఈ న్యాయమూర్తి చేసిన ఈ వీడియోలు టిల్లుని కొడుతుంటే పోలీసులు అడ్డుకోకపోగా వెనక్కి వెళ్లినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపించింది. కాగా..టిల్లుపై దాడి చేసినప్పుడు తీహార్ జైలు గదిలో విధులు నిర్వహిస్తున్న తమిళనాడు స్పెషల్ పోలీస్ లోని ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.టిల్లును చంపిన గ్యాంగ్ లో యోగేష్ తో పాటు దీపక్, రాజేష్,రియాజ్ ఖాన్ లు ఉన్నారు.

No comments:

Post a Comment