ఇమ్రాన్ ఖాన్‌కు 8 రోజులు రిమాండ్

Telugu Lo Computer
0


అవినీతి ఆరోపణల కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ అరెస్టైన సంగతి తెలిసిందే. నేడు ఎన్‌ఏబీ అధికారులు యాంటీ కరప్షన్‌ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అల్‌-ఖాద్రీ ట్రస్ట్‌ భూములపై విచారణ సందర్భంగా ఆయనను 14 రోజులపాటు రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయస్థానం 8 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.ఇక తమ నేత అరెస్టుకు నిరసనగా ఇమ్రాన్ మద్దతుదారులు బుధవారం పెషావర్ లోని రేడియో పాకిస్తాన్ ప్రధాన కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఈ కార్యాలయం లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. వీరి నిరసనల నేపథ్యంలో పలు చోట్ల సుమారు వెయ్యి మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పాక్ మాజీ ప్రధానికి సన్నిహితులైన నేతలను కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు దేశంలోని ప్రధాన భవనాలపైన, పార్లమెంట్ పైన పెద్దఎత్తున దాడులు జరిపేందుకు ఇమ్రాన్, ఆయన పార్టీ కుట్రలు పన్నినట్టు ప్రభుత్వం ఆరోపించింది. ఆయన మద్దతుదారులు స్కూళ్లను, ఇతర ప్రభుత్వ ఆస్తులను తగులబెడుతున్నారని, హింసకు పాల్పడుతూ అరాచకం సృష్టిస్తున్నారని తెలిపింది. అల్ ఖదీర్ ట్రస్ట్ నిధులదుర్వినియోగం కేసులో మంగళవారం ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఇస్లామాబాద్ కోర్టులో పాక్ రేంజర్లు ఇమ్రాన్‎ను అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ అరెస్ట్ సమయంలో కోర్టులో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమయంలో ఇమ్రాన్ లాయర్లు గాయపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)