రేపు 24 మందితో మంత్రివర్గ విస్తరణ !

Telugu Lo Computer
0


కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. కొత్త మంత్రుల పేర్లతో కూడిన జాబితాపై పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలిపింది. 20 నుంచి 24 మంది శాసన సభ్యులు- శనివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తొలిదశలో వారిద్దరితో పాటు ఎనిమిది- డాక్టర్ జీ పరమేశ్వర, కే హెచ్‌ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహోలి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి శాఖలను ఇంకా కేటాయించలేదు. పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన తరువాత శాఖలన కేటాయిస్తామంటూ అప్పట్లోనే ప్రకటించారు సిద్ధరామయ్య, డీకే శివకుమార్. కొత్త మంత్రుల పేర్లతో కూడిన జాబితాతో ఇటీవలే ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్‌ సింగ్ సూర్జేవాలా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో- ముందుగా నిర్దేశించుకున్న 28 మందికి అదనంగా మరో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. మంత్రుల జాబితాపై మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో సిద్ధరామయ్య- డీకే శివకుమార్ వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. 32 మందితో కర్ణాటక కొత్త మంత్రివర్గం కొలువుదీరే అవకాశాలు ఉన్నాయి. ఈ జాబితాలో నరేంద్ర స్వామి, చలువరాయస్వామి, ఎంసీ సుధాకర్, డీ సుధాకర్, లక్ష్మీ హెబ్బాళ్‌కర్, బైరతి సురేష్, బసవరాజ రాయ రెడ్డి, పుట్టరంగ షెట్టి, హెచ్‌సీ మహదేవప్ప, కృష్ణ బైరేగౌడ, అజయ్ ధరమ్ సింగ్, హెచ్‌కే పాటిల్, శరణ బసప్ప దర్శనాపుర, రహీం ఖాన్, కేఎన్ రాజన్న, శివలింగె గౌడ, ఈశ్వర్ ఖండ్రే, శివానంద పాటిల్, కే వెంకటేష్, ఎస్ ఎస్ మల్లికార్జున, శివరాజ్ తంగడగి, బీ నాగేంద్ర, దినేష్ గుండూరావు, లక్ష్మణ సవాది, జగదీష్ షెట్టర్, ఆర్‌వి దేశ్‌పాండే, ఎం కృష్ణప్ప పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)