20 ఏళ్లు శిక్ష అనుభవించాక నిర్దోషి అని తేల్చిన కోర్టు !

Telugu Lo Computer
0


చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ లో అబ్దుల్లా ఆయూబ్ కానిస్టేబుల్‌ ఖుర్షిద్ కు తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు. ఖుర్షిద్ ఇంటి కిరాయి ఇవ్వకపోవడంతో అబ్దుల్లా అతడ్ని ఇళ్లు ఖళీ చేయించాడు. దీంతో అతనిపై పగబట్టిన ఖుర్షిద్ రాయ్‌పూర్‌లోని పురాని బస్తీ పోలీస్ స్టేషన్‌లోని సిబ్బందితో కలిసి కుట్ర పన్ని, కోటి రూపాయలు విలువ చేసే హెరాయిన్ కలిగి ఉన్నడనే కేసులో అబ్దుల్లాను ఇరికించాడు. దీంతో 2003 మార్చి 14 అబ్దుల్లాకు జైలు శిక్ష పడింది. తాను అమాయకుడినని అబ్దుల్లా ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న 25 గ్రాముల పౌడర్‌ను లక్నోలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా అది హెరాయిన్ కాదు, సాధారణ తెల్లపౌడర్ అని చాలా ఏళ్లకు తెలిసింది. దీంతో ఒక తప్పుడు కేసులో దాదాపు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన అబ్దుల్లాను ఛత్తీస్‌గఢ్‌లోని ఓ న్యాయస్థానం అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది. ఇటీవలే అతను విడుదలయ్యాడు. కానీ 20 ఏళ్ల తర్వాత అతను నిర్దోషి అని కోర్టు తేల్చడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇన్నేళ్లపాటు అతడ్ని జైల్లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)