ధీరీంద్ర కృష్ణ శాస్త్రికి రూ.1000 జరిమానా !

Telugu Lo Computer
0


ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా బాగశ్వర్ ధామ్ పీఠాధిపతి పండిట్ ధీరీంద్ర కృష్ణ శాస్త్రికి  బీహార్ పోలీసులు రూ.1,000 ఫైన్ వేశారు. చలానాను ఆయనకు పంపారు. 90 రోజుల్లో చలానా సొమ్ము చెల్లించకుండే ఆ వాహనాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సిందిగా రవాణా శాఖకు ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. ఐదు రోజుల పాటు పాట్నా పర్యటన కోసం బాగేశ్వర్ బాబా ఇటీవల వచ్చారు. స్వయం ప్రకటిత గాడ్‌మన్ బాగేశ్వర్ బాబా పాట్నా పర్యటనలో కారు ఫ్రంట్ సీటులో బెల్డ్ ధరించకుండా నిబంధనలను ఉల్లంఘించడంతో ఆయనకు రూ.1,000 చలనా జారీ చేసినట్టు పాట్నా ట్రాఫిక్ పోలీసులు ధ్రువీకరించారు. మే 13న పండిట్ బాగేశ్వర్ బాబా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న ఎస్ యువి లో ముందు సీట్లలో కూర్చుని ప్రయాణించారు. పాట్నా విమానాశ్రయం నుంచి పానాచే హోటల్‌కు కారులో వెళ్లారు. సీటు బెల్డ్ లేకుండా ప్రయాణించడం ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను కూలంకషంగా పరిశీలించిన పోలీసులు తివారీ, బాగేశ్వర్ బాబాకు రూ.1,000 చలనా వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)