ముస్లిం ఓటు ఒక్కటి కూడా మాకొద్దు !

Telugu Lo Computer
0


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఒక్క ముస్లిం ఓటు కూడా అక్కర్లేదని మాజీ ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. జాతీయవాద ముస్లింల ఓట్లు ఎలాగూ తమకు పడతాయని అన్నారు. శివమొగ్గలో జరిగిన వీరశైవ-లింగాయత్ సమావేశంలో మాజీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ''ముస్లింల ఓట్లు మాకు అక్కరలేదు. ఆరోగ్యం, విద్య వంటి అంశాలపై వారికి మేము చాలా సాయం చేశాం. అందువల్ల ఎక్కువ మంది ముస్లింల ఓట్లు మాకే పడతాయి'' అని అన్నారు. పార్టీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై ఈశ్వరప్ప ప్రశంసలు కురిపించారు. ఆయన నిజమైన హిందువు అని, హిందువులకు ఆయన ఒక మోడల్ అని కొనియాడారు. పార్టీ అభ్యర్థి చంద్రప్ప సైతం సిటీలో హిందూ కమ్యూనిటీ బలపడటానికి ఎంతో కృషి చేశారని అన్నారు. బీజేపీ మినహా ఏ పార్టీ గెలిచినా హిందువులకు భద్రత ఉండదంటూ అనేక మంది తనతో చెప్పినట్టు తెలిపారు. దేశాన్ని విభజించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఈశ్వరప్ప ఆరోపించారు. "ముస్లింలు ఎక్కువ, హిందువులు తక్కువ అనే భావానికి మేము చోటివ్వం. అయితే, కొందరు జాతీయవాద ముస్లింలు తప్పనిసరిగా బీజేపీకి ఓటు వేస్తారు. కాంగ్రెస్‌తో కొనసాగే కొందరు జాతివ్యతిరేకులను ఆ విధంగానే ఉండనీయండి. కులం పేరుతో విభజించాలని చూసేవారంతా విఫలం కాకతప్పదు'' అని విపక్షాలను ఉద్దేశించి ఈశ్వరప్ప అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)