టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లకు ఆదివారాలు సెలవు లేదు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు జరిగే 3,349 పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 30 మధ్య వచ్చే ఆరు ప్రభుత్వ హాలీడేస్‌లో తరగతులు నిర్వహించాలని తొలుత ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నెల 30లోపు నాలుగు ఆదివారాల్లో అనగా ఏప్రిల్ 9, 16, 23, 30 తేదీల్లో స్కూళ్లు నిర్వహించాలని సూచించింది పాఠశాల విద్యాశాఖ. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 30 వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు జరుగుతాయి. మరోవైపు 1 నుంచి 9 తరగతులకు ఏప్రిల్ 27 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండు రోజుల్లో ఫలితాల ప్రకటన, పేరెంట్స్ మీటింగ్స్ ఉంటాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)