రెజ్లర్లకు సంఘీభావం తెలిపిన ప్రియాంక గాంధీ

Telugu Lo Computer
0


లైంగిక వేధింపులకు నిరసనగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టిన రెజ్లర్లకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కలిసి సంఘీభావం తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదయినప్పటికీ రెజ్లర్లు సమ్మె కొనసాగిస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్‌కు వ్యతిరేకంగా వినేష్ ఫోగట్ మరియు ఇతర రెజ్లర్లు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎఫ్‌ఐఆర్ కాపీని తీసుకునేందుకు రెజ్లర్లు ఈ రోజు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఇది ఇలావుండగా తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత బ్రిజ్‌భూషణ్ శరణ్ తొలిసారిగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన సమాచారం ఇంకా అందలేదని, ఎఫ్‌ఐఆర్ కాపీ అందిన వెంటనే సమాధానం ఇస్తానని చెప్పారు. నేను నిర్దోషినని, విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉందని, ఎస్సీ ఆదేశాలను గౌరవిస్తానని ఆయన అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)