సునీత, శివ శంకరరెడ్డి బెదిరించారు !

Telugu Lo Computer
0


వివేకా హత్య కేసులో భారీ ట్విస్ట్. తెర మీదకు వివేక భార్య షమీమ్ ఎంట్రీ ఇచ్చారు. వివేకాతో వివాహం నుంచి ఆయన కుటుంబ సభ్యులు తనతో ఎలా వ్యవహరించారో వివరించారు. సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో తనకు వివేకా ఇస్తానని చెప్పిన ఆస్తులు, వివేకా కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన బెదిరింపులను వివరించారు. తమ ఇద్దరి కుమారుడు గురించి షమీమ్ చెప్పుకొచ్చారు. అవినాష్ రెడ్డి తన వాదనల్లో ప్రధానం గా వివేకా రెండో భార్య..కుటుంబలో వివాదాల గురించి ప్రస్తావిస్తున్న వేళ...ఇప్పుడు షమీమ్ స్టేట్ మెంట్ సంచలనంగా మారుతోంది. వివేకా రెండో భార్య వ్యవహారం పైన కొద్ది రోజులుగా వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. వివేకా రెండో భార్య ఉన్నారని..2010లో వివేకా పేరు మార్చుకున్నారని..వారిద్దరి ఒక కుమారుడు ఉన్నారని చెబుతూ వచ్చారు. వారితో వివేకా కుమార్తె, కుటుంబ సభ్యులకు గొడవలు ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా వివేకా అక్రమ సంబంధాల అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు అవినాష్ పైన సునీత న్యాయ పోరాటం చేస్తున్న క్రమంలో ఇప్పుడు షమీమ్ సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ బయటకు వచ్చింది. అందులో 2010 లో వివేకా తనను వివాహం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. 2015లో తమకు ఒక కుమారుడు జన్మించాడని..పేరు షేహన్ షా గా వివరించారు. వివేకా కు దూరం గా ఉండాలని సునీత రెడ్డి బెదిరించారని షమీమ్ సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో చెప్పినట్లు తెలుస్తోంది. వివేకా హత్యకు కొన్ని గంటల ముందు తనతో ఫోన్ లో మాట్లాడారని వివరించారు.బెంగళూరు భూ సెటిల్మెంట్ లో 8 కోట్లు వస్తాయని వివేకా చెప్పారని షమీమ్ వెల్లడించారు. తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని..తమను దూరం పెట్టారని పేర్కొన్నారు. షేహాన్ షా ను రాజకీయం గా పైకి తీసుకొస్తా అని వివేకా చెప్పేవారని చెప్పుకొచ్చారు. పలు మార్లు శివ ప్రకాష్ రెడ్డి నన్ను బెదిరించారని షమీమ్ కీలక అంశాలను బయట పెట్టారు. ఆ కారణం గానే చనిపోయాడని తెలిసినా రాలేకపోయానంటూ సీబీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. వివేకాకు సంబంధించి అన్యాయంగా వివేకా చెక్ పవర్ ను తొలగించారని షమీమ్ వివరించారు. తాను ఒక డీజీపీ ఇంట్లో ఆరు నెలల సమయంలో ఉండాల్సి వచ్చిందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ అధికారి ఎవరనేది మాత్రం బయటకు చెప్పలేదు. ఆ సమయంలో వివేకా ఒక్కరే సెక్యూరిటీ లేకుండా వచ్చేవారని వెల్లడించారు. రెడ్డి సార్ అని చెప్పటం మినహా పేరు పూర్తిగా ప్రస్తావన చేయలేదని తెలుస్తోంది. ఇప్పుడు షమీమ్ వివేకా ఆస్తుల్లో తనకు రావాల్సిన వాటా.. ఇతరత్రా వ్యవహారాల పైన న్యాయ పోరాటానికి కూడా సిద్దపడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు షమీమ్ ఎంట్రీతో వివేకా హత్య కేసు విచారనణలో కీలక మలుపు గా మారుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)