'జగనన్నే మా భవిష్యత్తు' మెగా సర్వే

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ 'జగనన్నే మా భవిష్యత్తు' అనే పేరుతో ఈ అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అత్యంత విస్తృతంగా అందరినీ కలుపుకొని 'మెగా సర్వే' చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది పార్టీ సైనికులు పాల్గొంటారని, వారంతా 14 రోజుల్లో అంటే ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ సర్వేలో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి అరవై లక్షల కుటుంబాలను, 5 కోట్ల మంది ప్రజలను స్వయంగా కలిసి ఈ 'మెగా సర్వే' చేస్తున్నామని చెప్పారు. ఈ 7 లక్షల మంది కార్యకర్తల్లో కొత్తగా నియమించబడిన గృహ సారధి, వార్డు సచివాలయం కన్వీనర్లు కూడా ఉంటారన్నారు. ఈ సైనికులందరూ గత మూడు, నాలుగు నెలలుగా పార్టీ కేంద్ర కార్యాలయం, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు ఎమ్మెల్యేలతో నేరుగా సంప్రదింపులు జరిపారని, ప్రత్యేకంగా మండలాల వారిగా శిక్షణ కూడా పొందారన్నారు. ఈ మెగా సర్వేలో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయన్నారు. ప్రజామోదం జగన్ కు ఎంత ఉంది అన్నదానిపైనా క్లారిటీ వస్తుంది అంటున్నారు. ముఖ్యంగా నాలుగు అంశాలు ఉన్నాయని సజ్జల వివరించారు. అందులో మొదటిది గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి పోలికకు సంబంధించిన ప్రశ్న ఉంటుంది, రెండోది ప్రజలకు తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందజేస్తోంది. కుల, మత, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాల నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోంది. తద్వారా సంక్షేమ పథకాల అమలులో మధ్యవర్తులు, అవినీతికి తావు లేకుండా చేసింది. ఈ పథకాలు ఎలా అందుతున్నాయన్నదానిపై ఆరా తీస్తామన్నారు. టీడీపీ హయాంలో పథకాలు అందాలంటే ప్రజలు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చేవారు. ఈ పరిస్థితిని వైఎస్సార్ సీపీ పూర్తిగా మార్చివేసింది అన్నారు. ఎక్కడా ఒక్క రూపాయి లంచం లేకుండా, రాజకీయాలకు కులాలకు అతీతంగా లబ్ధి పొందేలా చేస్తున్నామని, ఆ వివరాలు కూడా సేకరిస్తామన్నారు. అలాగే మన బడి, నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దింది. దీంతో పేద విద్యార్థులకు డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, అధునాతన ట్యాబ్‌లు, మెరుగైన టాయిలెట్లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంగ్లీష్ మీడియం చదువులతో పిల్లల బంగారు భవిష్యత్తు బాటలు వేస్తోంది. అదే గత టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరి కనీసం త్రాగు నీరు, టాయిలెట్ల ఉండేవి కావు. రాష్ర్ట చరిత్రలో తొలిసారిగా బీసీలను వెన్నుముకగా గుర్తించి వారికి రాజకీయాల్లో కీలక పదవులు ఇచ్చి సీఎం జగన్ చరిత్రను తిరగరాశారన్నారు వీటిపైనా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. కరపత్రాల పంపిణీ తరువాత ప్రజా మద్దతు పుస్తకంలోని ప్రశ్నలను అడిగి ప్రత్యేకమైన 'పీపుల్స్ సర్వే' నిర్వహిస్తామన్నారు. ఈ ప్రశ్నల ద్వారా ప్రజలను వారి భవిష్యత్తు కోసం సీఎం జగన్‌ను విశ్వసిస్తున్నారా అని అడగనున్నారు. జగన్ ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలకు జగనన్నకు మద్దతు ఇస్తున్నట్లు ధృవీకరిస్తూ రసీదు ఇస్తామన్నారు. అలాగే ప్రజల అనుమతితో జగనన్నే మా భవిష్యత్తు స్టిక్కర్లను తలుపు, సెల్ ఫోన్ స్టిక్కర్లను అతికిస్తామన్నారు. చివరగా ప్రజలు జగనన్నకు తమ మద్దతును తెలిపేందుకు 82960-82960 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)