గోడ గడియారాన్నిఏ దిశలో ఉంచాలి ?

Telugu Lo Computer
0


గడియారాన్ని తప్పుడు దిశలో ఉంచినట్లయితే అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కార్పొరేట్ రంగంలో గడియారాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాస్తు శాస్త్రంలో ఘడియలకు సంబంధించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. గడియారాన్ని తలుపు పైన పెట్టవద్దు. దీంతో ఇంట్లో ప్రతికూలత వ్యాపిస్తుంది. ప్రధాన ద్వారం కింద లేదా బెడ్ రూమ్స్ తలుపుల పైన గడియారాన్ని పెట్టరాదు. దీనివల్ల ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొటారు. అదే సమయంలో గడియారం కింద నుంచి తిరగకూడదని చెబుతారు. గడియారం ఇంట్లో కానీ, లేదా ఆఫీసులో కానీ ఎప్పుడూ దక్షిణ దిశలో ఉంచకూడదు. దీనివల్ల ఇల్లు లేదా ఆఫీసులోకి నెగటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణలు నమ్ముతారు. అంతేకాకుండా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయని వారు నమ్ముతారు. తూర్పు, పడమర లేదా ఉత్తరం దిశలో గడియారాన్ని ఉంచండి. ఇది సానుకూలతను పెంచుతుంది. మీరు ఈ దిశలలో చూస్తే, మీరు సానుకూల శక్తిని పొందడమే కాకుండా పని కూడా బాగా జరుగుతుంది. లక్ష్మీ దేవత అనుగ్రహం ఉంటుందని, ఆర్థికంగా బలపడే అవకాశం కూడా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)