ఉక్రెయిన్ మంత్రి భారత పర్యటన !

Telugu Lo Computer
0


ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మొట్ట మొదటి డిప్యూటీ మంత్రి ఎమిన్ జాపరోవా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు భారత్ వచ్చారు. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సంజయ్ వర్మతో ఎమిన్ జాపరోవా చర్చలు జరపనున్నారు. యుద్ధం జరుగుతున్న వేళ ఆమె భారత్ కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ తో ఆమె ధ్వైపాక్షిక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ లో యుద్ధం, భారత్-ఉక్రెయిన్ మధ్య సత్సంబంధాలు, అంతర్జాతీయ సమస్యలు వంటి అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో కూడా ఎమిన్ జాపరోవా సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే, జాతీయ భద్రతా ఉప సలహాదారు విక్రమ్ మిస్రీతోనూ ఆమె సమావేశం కానున్నారు. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మొట్టమొదటి డిప్యూటీ మంత్రి ఎమిన్ జాపరోవాకు భారత్ లోకి స్వాగతం పలికామని, ఇరు దేశాల ధ్వైపాక్షిక సంబంధాలు, సహకారంపై చర్చించామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సంజయ్ వర్మ ట్విట్టర్ లో తెలిపారు. ఆమె పర్యటన విజయవంతం అవుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)