ఎనిమిది బ్యాంకుల లైసెన్స్ రద్దు !

Telugu Lo Computer
0


దేశంలో కోఆపరేటివ్ బ్యాంకులు చాలా కీలకమైనవి. గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే పాక్షిక పట్టణ ప్రాంతాల్లో ఇవి బ్యాంకింగ్ సేవలు అందిస్తూ ఉంటాయి. అయితే వీటిపై చాలా ఒత్తిడి ఉంటుంది. కఠిన నిబంధనలు, పేలవమైన ఆర్థిక పరిస్థితులు, స్థానిక రాజకీయలు వంటి వాటి వల్ల ఈ కోఆపరేటివ్ బ్యాంకుల మీద ఒత్తిడి నెలకొంది. అలాగే బ్యాంకుల పెద్దన్న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా కోఆపరేటివ్ బ్యాంకుల మీద గట్టి నిఘా ఉంచింది. ఎప్పటికప్పుడు వాటి పనితీరును గమనిస్తూ వస్తోంది. కోఆరేటివ్ బ్యాంకులు బ్యాంకులు సరిగా లేకపోతే.. అంటే ఆర్థికంగా బలహీనంగా ఉండి, దివాలా తీయొచ్చనే అవకాశాలు కనిపిస్తూ ఉంటే.. ఆర్‌బీఐ వాటిపై ఉక్కు పాదం మోపుతోంది. లైసెన్స్ రద్దు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఆర్‌బీఐ 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8 కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది. అందుకే కోఆపరేటివ్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారు అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. బ్యాంక్ పని తీరు ఎలా ఉందో చూడాలి. రిజర్వు బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన బ్యాంకులను గమనిస్తే.. సేవా వికాస్ కోఆపరేటివ్ బ్యాంక్, దక్కన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, మిలాత్ కోఆపరేటివ్ బ్యాంక్, ముధోల్ కోఆరేటివ్ బ్యాంక్, శ్రీ ఆనంద్ కోఆపరేటివ్ బ్యాంక్ , రూపీ కోఆపరేటివ్ బ్యాంక్, బాబాజీ దాతే మహిళా అర్బన్ బ్యాంక్, లక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్ వంటివి కూడా ఉన్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)