ఆడంబర వేడుకలు వద్దు !

Telugu Lo Computer
0


రాజస్థాన్ మేవార్ జాట్ మహాసభ భిల్వారా ఆధ్వర్యంలో జాట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. రాజస్థాన్ మేవార్ జాట్ మహాసభ ప్రధాన కార్యదర్శి శోభరామ్ జాట్ మాట్లాడుతూ సమాజంలో ఎక్కువగా జరుగుతున్న పెళ్లిళ్లు, ఇతర ఖర్చులను తగ్గించాలని, ఆడంబరాలకు పోకూడదని నిర్ణయించారు. వివాహాలతో పాటు ఇతర వేడుకలలో.. మౌసర్‌లో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. వీటితో పాటు కార్యక్రమాలకు హాజరుకావాల్సిన సంఖ్యను కూడా పరిమితి చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై గరిష్టంగా 500 నుంచి 700 మంది పురుషులు హాజరుకావచ్చు. అంతే కాకుండా నగదు పరంగా కూడా కొన్ని పరిమితులు విధించుకున్నారు. వీటితో పాటు పెళ్లికి భారీ మొత్తంలో వెచ్చిస్తున్న ఖర్చుకు అడ్డుకట్ట వేస్తూ సమాజంలో సామూహిక వివాహాలను ప్రోత్సహించనున్నారు. అదే విధంగా.. ఇతర వేడుకల విషయంలో కూడా ఆయా కుటుంబాలు వారికి తాహత్తులో ఖర్చు చేయాలని కమిటీ సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)