గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్‌ గాంధీ !

Telugu Lo Computer
0


మోడీ ఇంటిపేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ గుజరాత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 20న సూరత్‌ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. 2019లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ 'దొంగలందరికీ మోడీ ఇంటిపేరే ఎందుకు ఉంది' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానిపై బీజేపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోడీ సూరత్‌ కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు.. మార్చి 23న చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు రాహుల్‌ గాంధీని దోషిగా తేలస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షను తాత్కాలింగా నిలిపివేస్తూ నేరారోపణకు వ్యతిరేకంగా నెల రోజుల్లోగా అప్పీల్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే, కోర్టు శిక్ష నేపథ్యంలో రాహుల్‌ గాంధీపై లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత సెషన్‌ కోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఆయన గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)