భారత్ కు తలుపులు తెరిచే ఉన్నాయ్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 1 April 2023

భారత్ కు తలుపులు తెరిచే ఉన్నాయ్ !


భారత్‌తో సంబంధాల కోసం నార్త్‌ అట్లాంటిక్‌​ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో) తలుపులు తెరిచే ఉంచింది అంటూ జూలియన్నే స్మిత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. యుక్రెయిన్ నాటోలో చేరుతుందనే సంకేతాలతోనే రష్యా యుక్రెయిన్ పై దండయాత్ర చేపట్టింది. దాదాపు సంవత్సరం దాటిపోయింది. అయినా ఈ యుద్ధానికి ముగింపు పలకటంలేదు. అమెరికా వంటి దేశాలు చేస్తున్న సహాయంతో యుక్రెయిన్ రష్యాను ఎదుర్కొంటునే ఉంది. ఈ క్రమంలో భారతదేశంతో సన్నిహిత సంబంధాల కోసం 'నాటో తలుపులు తెరిచే ఉంచింది' అంటూ స్మిత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారత్‌తో సాన్నిహిత్యంగా ఉండటం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారామె. అంతేకాదు…భారత్ కోరుకుంటూ ఏ సమయంలో అయినా ఈ అంశం గురించి చర్చించటానికి నాటో రెడీగా ఉందని అన్నారు స్మిత్. అంటే స్మిత్ చేసిన ఈ వ్యాఖ్యలు నాటోలో భారత్‌ చేరేలా యూఎస్‌ డైరెక్ట్ గా సంకేతాలిస్తున్నట్లుగా ఉందని తెలుస్తోంది. భారత్‌, యూఎస్‌ల మధ్య సన్నిహిత సంబంధాలకు సంబంధించి భాగస్వామ్యం దృఢంగా ఉందని..ఇరు దేశాల ప్రజాస్వామ్యం, నియమాల ఆధారిత క్రమంల, వాతావరణ మార్పు, హైబ్రిడ్ బెదిరింపులు, సైబర్ భద్రత, టెక్నాలజీ, వంటి విషయాల్లో కలిసి పనిచేయడంలో ఉన్నామని తెలిపారు. ఇండో -పసిఫిక్ తో నాటో తన విస్తరణను పెంచుకుందని..చైనాను నాటో వ్యవస్థాగత సవాలుగా గుర్తించిందని అన్నారు. ఆయా ప్రాంతాలలోని భాగస్వామ్యుల వ్యూహాత్మక విధానాల తోపాటు ముఖ్యంగా చైనా దూకుడు విధానానికి సంబంధించి వ్యూహాల గురించి తెలుసుకునేందుకు నాటో ఆసక్తి కనబరుస్తోందని అన్నారు. నాలుగు ఇండో పసిఫిక్ దేశాలు నాలుగు ఇడో పసిఫిక్‌ దేశాలు జపాన్‌, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, లిథువేనియాలో జరగనున్న అత్యున్నత స్థాయి నాటో సమావేశానికి ఆహ్వానం అందింది అని స్మిత్ తెలిపారు. ఈ దేశాలతో తమ పార్టనర్ షిప్ మరింతగా అభివృద్ధి చెందిందని తెలిపారు. నాటో ఏ ఇండో పసిఫిక్ దేశంతోను పొత్తులు పెట్టుకునే ఆలోచన కూడా లేదని..అంతేకాదు విస్తృత కూటమిగా విస్తరించాలనే ఆలోచన కూడా లేదని స్మిత్ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రష్యా, యుక్రెయిన్ యుద్ధం గురించి ప్రశ్నించగా స్మిత్ మాట్లాడుతూ..పుతిన్ కేవలం ఒక్కరోజులోనే యుద్ధాన్ని ముగించలేదని..పశ్చిమదేశాలు కేవలం యుక్రెయిన్ కు అవసరమైనవాటిని అంటే ఆయుధ సామగ్రివంటివి అందించటమే కాదు..భవిష్యత్తులో రష్యా చేసిన పనిని ఇతర దేశాలు కూడా చేసే ప్రమాదం కూడా ఉందని గుర్తు చేశారు. అలాగే రష్యా, భారత్ మధ్య ఉన్న స్నేహ సంబంధాల గురించి ప్రశ్నించగా యుక్రెయిన్ కు భారతదేశం మానవతా దృక్పథంతో సహాయం చేసిందని నాటో ప్రతినిథి స్మిత్ ప్రశంసించారు. అలాగే ఈ యుద్ధాన్ని ముగించాలని స్మిత్ పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం దాదాపు అన్ని దేశాలను ఏకతాటిపైకి తెచ్చిందని..స్వీడన్, ఫిన్లాండ్ కూడా నాటోలో చేరడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారామె. రష్యా యుక్రెయిన్ పై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని చేసిన ప్రకటను ఆమె తప్పు పట్టారు. రష్యా అణ్వాయుధాలను ప్రయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రష్యా కొన్ని అణ్వాయుధాలను బెలారస్ కు తరలిచిందని…నాటో ఈ విషయాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తోందని ఈ సందర్భంగా యూఎస్‌ నాటో రాయబారి స్మిత్ తెలిపారు.

No comments:

Post a Comment