పెరూ సరిహద్దుల్లో 60 రోజుల పాటు అత్యవసర పరిస్థితి !

Telugu Lo Computer
0


ఈక్వెడార్‌, కొలంబియా, బ్రెజిల్‌, చిలీలతో సరిహద్దు ప్రాంతాల్లో పెరూ 60 రోజుల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. జరుమిల్లా (టుంబేస్‌), సులానా, అయబాకా, శాన్‌ ఇగ్నాసియో, మేనాస్‌, లరెటో, డేటెమ్‌డెల్‌, మరానొవ్‌ తహుమాను, టాక్నా, టార్టా ప్రాంతాల నుండి పెరుగుతున్న వలసలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెరూ అధ్యక్షురాలు డినా బలూర్టే పేర్కొన్నారు. జాతీయ పోలీసులు, సాయుధ బలగాలు సరిహద్దుల్లో నియంత్రణను పర్యవేక్షిస్తారని అన్నారు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రత, అసెంబ్లీ, ఉద్యమ స్వేచ్ఛల సాధనను పరిమితం చేయనున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం చట్రానికి లోబడి నిఘా చర్యలు చేపడతామని బలూర్టే పేర్కొన్నారు. దేశంలో నేరాల పెరుగుదలకు వలసదారులే కారణమని బలూర్టే ఆరోపించారు. ఇది పెద్ద అభద్రతా సమస్యగా పేర్కొన్నారు. పెరూవియన్‌ మంత్రిమండలి కూడా ఈ నిబంధనలను ఆమోదించింది. ఈచర్య ద్వారా విదేశీ వలసదారులను సులభతరంగా క్రమబద్దీకరించవచ్చని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)