పార్ట్ టైం జాబ్ పేరుతో 20 లక్షలు కాజేశారు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌కు చెందిన బాధితురాలు అంకిత ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో  హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అనే పేరుతో బాధితురాలి ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌కు ఆమె స్పందించి అందులో లింక్‌ను క్లిక్‌ చేయడంతో వాట్సాప్‌లోకి వెళ్లింది. వాట్సాప్‌లో యూట్యూబ్‌ లింక్‌లు క్లిక్‌ చేయడమే ఉద్యోగమని, రోజు ఎన్ని చేసుకుంటే అంత మొత్తంలో డబ్బులొస్తాయంటూ నమ్మించారు. ఆ తరువాత ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి అందులో తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టించి యూట్యూబ్‌ లింక్‌లను క్లిక్‌ చేసే టాస్క్‌ను అప్పగించారు. దీంతో బాధితురాలు మొదట తక్కువ పెట్టుబడికి మంచి లాభాలొచ్చాయి. దీంతో నమ్మకం పెరిగి నెమ్మదిగా పెట్టుబడి పెంచుతూ వెళ్లింది. అయితే యాప్‌లో స్క్రీన్‌పై లాభాలు కన్పిస్తున్నా వాటిని డ్రా చేసుకునే వీలు లేకుండా పోయింది. రూ. 20 లక్షలు పెట్టుబడి పెట్టిన తరువాత కూడా అదే పరిస్థితి ఉండటంతో ఇదంతా మోసమని గుర్తించి సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)